నవీనము

29, మార్చి 2016, మంగళవారం

ఓ శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను కాదని వెరొక దేవున్ని పూజించానా? లేదే



శా. స్వామిద్రోహము చేసి వేఱొకనిఁగొల్వం బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినొ? నిన్నే దిక్కుగాఁజూడనో?
యేమీ, యిట్టి వృథాపరాధి నగు నన్నీ దుఃఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా ? శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - ఓ శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను కాదని వెరొక దేవున్ని పూజించానా? లేదే! నీ వేదవాక్కులను నేమైనా వినలేదా? లేదే! నిన్నే దైవంగా కొలిచిన నాపై చిన్న చూపు ఏమిటి స్వామి! తప్పులు చేయని నన్ను ఈ సంసార దుఃఖ సాగరం మధ్య పడేయటం నీకు భావ్యమా తండ్రీ?

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy