నవీనము

29, మార్చి 2016, మంగళవారం

శ్రీ కాళహస్తీశ్వరా! చావుపుట్టకలతో కూడిన సంసారమమే కల్లు త్రాగి,



శా. భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁబ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్‌ నూతఁగూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! చావుపుట్టకలతో కూడిన సంసారమమే కల్లు త్రాగి, మత్తెక్కి, నరుడు మహాపాపాత్ముడై నిన్ను తెలుసుకోలేకపోతున్నాడని తలచి, నరకమనే సముద్రంలో పడిపోయిన ఈ దీనుని కావవేమి? ఆట ధ్యాసలో పడిన పిల్లవాడు పొరపాటున నూతిలో పడితే అతని తండ్రి పట్టించుకోకుండా ఉంటాడా? అందువలన నన్ను రక్షించు తండ్రీ!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy