నవీనము

26, జూన్ 2016, ఆదివారం

కంచి పరమాచార్య వైభవం నుంచి సేకరణ నగల పెట్టె !



కంచి పరమాచార్య వైభవం నుంచి సేకరణ

నగల పెట్టె !

ఒక వ్యక్తి భార్య అకస్మాత్తుగా మరణించింది. అతని నలుగురు కొడుకులు అత్యంత ప్రేమగా కొద్ది రోజులు చూసుకొన్నారు. ఒక మంచి రోజు చూసి తండ్రి ని ఆస్తి పంపకం చేయమని అడిగారు. ఎవరికి వారు తను ఇచ్చిన ఆస్తిని రెట్టింపు చేసి తండ్రి కి మంచి పేరు తెస్తామని హామి ఇచ్చారు. ఆ అమాయక తండ్రి ఆస్తి మొత్తం నలుగురికి సమం గా పంచేసాడు. మరునాడే కొడుకులు ఎవరికి వారు వేరు పడి తండ్రిని ఒక్కొక్కరు నెల చొప్పున చూసేటట్టు పంచుకున్నారు. మొదటి నెల పెద్దకొడుకు ఇంట్లో రెండువారాలు గడిచాయి. కొడుకు కోడలు నిర్లక్ష్యం చేయడం ప్రారంబమైంది. రెండో నెల రెండో కొడుకు ఇంటికి వెళ్లాడు. అక్కడా అంతే! మూడు వారాలు మించి ఉండలేకపోయాడు. నాలుగోవారం మూడో కొడుకు ఇంటికెళ్లాడు. అదేమిటి వారం ముందే వచ్చారు అని కోడలు అడిగింది. మిగిలింది షరా మామూలే! ఇక్కడ అంతకంటే ఘోరం. రెండు వారాల్లో చిన్న కొడుకు ఇంటికి బయలు దేరాడు! ఇదేంటి ! ఇంత తొందరగా వచ్చాడు ! ..ముసలాడు అనుకున్నారు కొడుకు కోడలు. ఇక్కడి నరకం భరించలేక వారంలో ఆశ్రమానికి బయలుదేరివెళ్లిపోయాడు. అక్కడ గురువు గారితో తన కష్టం చెప్పుకున్నాడు. గురువు గారు తన వద్ద నెలరోజులు ఉంచుకొని ఒక అందమైన పెద్ద పెట్టెను భహుమతిగా ఇచ్చి, మరణించే వరకు దీనిని నీదగ్గర ఉంచుకో ! అని సలహా ఇచ్చాడు. తాళం అడిగితే నాదగ్గర ఉందని చెప్పు అని చెప్పారు. కొడుకులు కోడళ్లు అడిగినా ఇవ్వవద్దని అందులో విలువైన సంపద ఉందని చెప్పాడు.
తండ్రి అందమైన పెద్ద పెట్టేతో తిరిగి వచ్చేసరికి పెద్ద కొడుకు ఆనందంతో స్వాగతం పలికాడు..! తండ్రి ఈ పెట్టెలో విలువైన సంపద ఉందని తన మరణానంతరం మీరు సమంగా పంచుకొండి అని చెప్పాడు. తాళం స్వామీజీ దగ్గర ఉంటుందని కూడ చెప్పాడు. నలుగురు కొడుకులు చాల ఆనందం తో తండ్రిని చాలబాగుగా చూడాలని భార్యలకు హుఖుం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తండ్రి తో ప్రేమగా కబుర్లు చెప్పేవారు.
కాల క్రమం లో తండ్రి ఆనందం గా మరణించాడు. మరణానంతరం కొడుకులు స్వామిజీ దగ్గర తాళం చెవులుతెచ్చి పెట్టె తెరచి చూసారు. అందులో నల్లటి రాళ్లు తప్ప మరేంలేవు. కొడుకులు కోపంతో .... అంతా మోసం అంటూ స్వామీజి దగ్గర గొడవకు వచ్చారు.
స్వామీజి అప్పుడు ఇలా బదులుపలికారు!
అందులో మోసం లేదు....నాయనా ..! మీ బుద్ధి స్వరూపం ఉంది! మీ తండ్రి ఆస్తి మొత్తం పంచిన తరువాత మీ నిర్లక్ష్యం తట్టుకోలేక నా వద్దకు వచ్చాడు. ఆ పెట్టె నేనే అతనికి ఇచ్చి పంపాను! అందులో ఏముందో ఆయనకు కూడ తెలియదు! నేను చెప్పమన్నది చెప్పాడు. "అందులో ఉన్నది నల్లని రాళ్ల స్వరూపం లో ఉన్న మీ బుద్థి. అది వదిలేస్తారో స్వీకరిస్తారో మీ ఇష్టం" అని స్వామీజి బదులిచ్చారు!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy