నవీనము

25, జనవరి 2016, సోమవారం

భారతదేశం నా మాతృ భూమి.గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు



భారతదేశం నా మాతృ భూమి..


గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

మన భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం అయితే ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది కానీ, ఈ రోజున భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా మనది పూర్తి గణతంత్ర దేశం అయినది. ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయినది. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు....

"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

మన ముందు తరాల త్యాగ ఫలాలు భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఏటా ఈ గణతంత్ర దినోత్సవమును జరుపుకోడానికి కాస్త తీరిక చేసుకుంటే చాలు అని మనవి చేసుకుంటూ ..

దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రునివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడను ప్రార్దిస్తూ..

మిత్రులకు మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy