నవీనము

ఒక మంచి మాట

యూట్యూబ్ హల్ చల్

హాస్యం

13, సెప్టెంబర్ 2016, మంగళవారం

ఆడపిల్లకు ముక్కుమీద కోపం అని మూకు కుట్టేస్తారు.



ఆడపిల్లకు ముక్కుమీద కోపం అని మూకు కుట్టేస్తారు.

చంచలస్వభావం ఎక్కువ కాబట్టి కాలిమెట్టెలు వేస్తారు.

అహంకారంతో చెవులు వినబడవని చెవులు కుట్టించి చెవిపోగులు వేస్తారు.


నీటిలో చేపల శబ్ధం వినిపిస్తుందిగాని అమ్మాయి నడుస్తున్నశబ్దం వినబడదని (కాళ్ళపట్టీలు) గజ్జెలు వేస్తారు.

అమ్మాయి మనసు అహంకారంతో అతిశయఒతో ప్రవర్తించకూడదని పెళ్ళి, మంగళసూత్రం, కుంకుమ, బంధువులు అనేవాటితో బంధిస్తారు.

మగవారికి ఇవన్నీ అవసరమేలేకుండా

"భార్య అనే ఒకేఒక్క ఆభరణం మగాడికి కట్టబెట్టి భర్త అహంకారం, రోషం, కోపం అన్నీ చల్లబడేట్టు చేస్తారు".

11, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని






డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని.
భార్యా తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు .
భార్య కి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక.
ఓయ్ నిద్ర పోతున్నావా " భర్త అడిగాడు.
" అవునండీ , మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా "

తెలవారదేమో స్వామీ





తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ


చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు

కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ..

తెలవారదేమో స్వామీ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ

ఆ మత్తు నే మది మరి మరి తలచగా..
మరి మరి తలచిగ..
అలసిన దేవేరి .. అలమేలు మంగకూ..

తెలవారదేమో స్వామీ..
చిత్రం : శృతిలయలు
గానం : యేసుదాస్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహాదేవన్


29, ఆగస్టు 2016, సోమవారం

ఒక పెద్దాయనకి 60 సం.లు వచ్చేసరికి

ఒక పెద్దాయనకి 60 సం.లు వచ్చేసరికి పిల్లలందరూ కలిసి షష్టిపూర్తి జరిపించారు...
తర్వాత సం. మళ్ళీ పెళ్ళి రోజు వచ్చే టైం కి ఆయనగారు నాకు మళ్ళీ మీ అమ్మతో పెళ్ళి జరిపించండ్రా అని పట్టుబట్టాడు..పోనీలే ముసలాడు ముచ్చట పడుతున్నాడు కదా అని మళ్ళీ పెళ్ళి చేశారు...
ఆ తర్వాతి సం.. మళ్ళీ అదే తంతు...మళ్ళి తన భార్యతో పెళ్ళి జరిపించమని గొడవ...
ఇహ విసుగొచ్చిన పెద్ద కొడుకు అన్నాడు..
" నాన్నా, నీకు మరీ ఇంత చాదస్తం పనికి రాదు.. పోనీలే కదా అని రెండు సార్లు పెళ్ళి చేశాం..మళ్ళీ ఇప్పుడంటే.. అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? "
" ఏమోరా అయ్యా.. కానీ.. పెళ్ళి జరిగేటప్పుడు పంతులుగారు ' ఇక అబ్బాయ్ ని పిలవండి ' అని నా గురించి అంటారు చూశావా.. ఆ పిలుపు కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువేరా

సన్యాసి సన్యాసి కలిస్తే బూడిదే రాలుతుంది..

సన్యాసి సన్యాసి కలిస్తే బూడిదే రాలుతుంది..
ఒక ఉదాహరణ

నేను ఓ అమ్మాయి వైపు తొంగి తొంగి చూస్తున్నా..
ఆమె కూడా నాపై వైపు తొంగి చూస్తోంది...
నావైపు ఆమె.. ఆమె వైపు నేను
నావైపు ఆమె.. ఆమె వైపు నేను
నావైపు ఆమె.. ఆమె వైపు నేను
నావైపు ఆమె.. ఆమె వైపు నేను
అది ఎప్పుడంటే...పరీక్ష సమయంలో హా..హా..హా
నాకు ఏమీ రాదు..ఆమెకూ ఏమీ తెలియదు హా..హా..హా

8, జులై 2016, శుక్రవారం

కాల్చొద్దు



కస్టమర్: ‌‌‌‌‌‌ఒక సిగరెట్ ఇవ్వు...
కిరాణా షాప్: ఇచ్చాడు ...
కస్టమర్ : అగ్గి పెట్టె ఇవ్వు సిగరెట్ అంటించుకొని ఇస్తా..
కిరాణా షాప్:ఇవ్వను...
కస్టమర్: ఎందుకు ఇవ్వవు...
కిరాషా షాప్: ఇది public place కాల్చొద్దు...
కస్టమర్ : public place లో సిగరెట్ ఎందుకు అమ్మావ్..
కిరాణాషాప్: నేను ఇక్కడ ఉప్మా రవ్వ కూడా అమ్ముతా..
అలా అని ఇక్కడే వండుకు తింటావా

7, జులై 2016, గురువారం

శ్రీవేంకటేశ్వర మహిమా వైభవము

శ్రీవేంకటేశ్వర మహిమా వైభవము
 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy