నవీనము

29, మార్చి 2016, మంగళవారం

స్వామి! శ్రీ కాళహస్తీశ్వరా! నీతో యుద్ధం చేయలేను



శా. నీతో యుద్దము సేయనోపఁ; గవితా నిర్మాణశక్తి న్నినుం
బ్రీతుం జేయగలేను; నీ కొఱకుఁ దండ్రింజంపగాఁజాల; నా
చేతన్‌ రోకట నిన్ను మొత్త వెఱతున్‌; జీకాకు నా భక్తి , యే
రీతిన్‌ నాకిక నిన్నుఁ జూడగలుగున్‌? శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - స్వామి! శ్రీ కాళహస్తీశ్వరా! నీతో యుద్ధం చేయలేను (కిరాతుడి జన్మ ఎత్తిన అర్జునుడు పరమశివుడితో యుద్ధం చేశాడ్య్ కదా). నిన్ను సంతోషపెట్టడానికి నా కవితా శక్తి సరిపోదు (నిన్ను ప్రతిభ మెప్పించదు). శివ భక్తురాలివలె నిన్ను రోకలితో దండించలేను. నీపై నాకున్న అచంచలమైన భక్తియే నాకు అడ్డు తగిలి నీ దయను పొందనివ్వకుండా ఉన్నది. నిన్ను చూసే భాగ్యం ఎలా కలుగుతుంది తండ్రీ!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy