నవీనము

31, మార్చి 2016, గురువారం

స్ఫూర్తి



కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు..
ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు,
పారే నది..... వీచే గాలి.... ఊగే చెట్టు.... ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాదించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..
లే బయలుదేరు, నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో,, పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు, నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్, నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో, నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంఢీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy