నవీనము

31, మార్చి 2016, గురువారం

శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను నా వాకిట కావలిగా ఉండమన్నానా? బాణాసురినివలె



శా. నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీలాలకభ్రాంతిఁగుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁజే
సిన నా విన్నపమేల చేకొనవయా? శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను నా వాకిట కావలిగా ఉండమన్నానా? బాణాసురినివలె! దేవతాస్త్రీల పొందుకొరకు నిన్ను అడిగానా! రాయభారం చేయమన్నానా! తిన్నడి వలె ఎంగిలి కూడు పెట్టి తినమని బలవంతం చేశానా! నేను ఏ అపరాధం చేశానని నన్ను కాపాడవు స్వామి?! సాధుజనులను, భక్తులను రక్షింపమన్నానే కానీ మరేమీ కోరలేదు కదా, మరి నా ప్రార్ధనలను ఎందుకు ఆలకించవు స్వామి!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy