నవీనము

31, మార్చి 2016, గురువారం

ఉత్తములు



తరువు లతిరసఫలభార గురుత గాంచు

నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత

జగతి నుపకర్తలకు నిది సహజగుణము...! 

భావం -
బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy