నవీనము

31, మార్చి 2016, గురువారం

కాళహస్తీశ్వరా! నీ నామం స్మరించినంత మాత్రమునే సర్వపాపాలు, ఘోరపాపాలు తొలుగుతాయని



శా. నిప్పై పాతకతూలశైల మడచున్‌ నీ నామమున్‌ మానవుల్‌
తప్పన్‌ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్‌
దప్పున్‌, దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్‌ మహాపండితుల్‌
చెప్పంగాఁదమకింక శంకవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! నీ నామం స్మరించినంత మాత్రమునే సర్వపాపాలు, ఘోరపాపాలు తొలుగుతాయని, యముని వలన కలిగే నరక బాధలు నశిస్తాయని శాస్త్రాలు, జ్ఞానులు చెప్తుండగా, ఈ మనుష్యులకు ఇంకా అనుమానమెందుకు తండ్రీ!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy