నవీనము

31, మార్చి 2016, గురువారం

శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించే సమయంలో కష్టాలే రానీ, నిత్య శుభాలే కలగనీ, జనులు సామాన్యుడువననీ,



మ. నిను సేవింపగ నాపదల్‌ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్‌ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - 
శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించే సమయంలో కష్టాలే రానీ, నిత్య శుభాలే కలగనీ, జనులు సామాన్యుడువననీ, గొప్పవాడవని పొగడననీ, సంసార వ్యామోహం కలగనీ, జ్ఞానమే కలగనీ, గ్రహాలు ప్రతి కూలంగా మారనీ, లేక మేలు జరగనీ, ఇవన్నీ నాకు అలంకారాలే స్వామి. నీ అనుగ్రహం వల్ల కలగినవే ఇవన్నీ. వాటిని నేను వద్దనను.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy