నవీనము

29, మార్చి 2016, మంగళవారం

శ్రీ కాళహస్తీశ్వరా! మనమిద్దరం అంగీకరించే మాట ఒకటి చెప్తాను విను



శా. నీ నా సందొడబాటుమాట వినుమా! నీచేత జీతంబునే
గానిం బట్టక సంతతంబు మదివేడ్కంగొల్తు, నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్‌ గరినొల్ల నొల్ల సిరులన్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! మనమిద్దరం అంగీకరించే మాట ఒకటి చెప్తాను విను. నీ నుంచి నాకు ఒక్క పైసా కూడా జీతం ఆశించకుండా మనసులో నిత్యం నిన్నే వేడుకుంటాను. కాన్ ఈశ్వరా! ఆ అంతశతృవులనిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు నేను బానిసను కాకుండా చూడు. ఆ దయ నాపై చూపు, అదొక్కటే చాలు. గుర్రాలు, ఏనుగులు, సంపదలు నేను ఆశించను.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy