తాలిమితోడఁ గూరిమిఁ గృతఘ్నున కెయ్యెడ నుత్తమోత్తము
ల్మే లొనరించినన్ గుణము మిక్కిలి కీడగుఁ బాముపిల్లకున్
పా లిడి పెంచిన న్విషము పాయఁగ నేర్చునె దానికోఱలం
జాలఁగ నంతకంత కొక చాయను హెచ్చునుగాక భాస్కరా.
భావం - మంచివాడు కృతఘ్నునికి ఎంత సహాయం చేసినా, అది తనకి కీడే చేస్తుంది గానీ మేలు కాదు. పాముకు పాలు పోసి పెంచడం వలన దాని కోరలలో విషం పెరుగుతుందే కానీ తగ్గుతుందా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి