నవీనము

3, జనవరి 2016, ఆదివారం

తెలియని కార్యo



తెలియని కార్య మెల్లఁ గడతేర్చుట కొక్కవివేకిఁ జేకొనన్‌
వలయునటైనదిద్దుకొనవచ్చుఁ బ్రయోజనమాంద్యమేమియుం
గలుగదు ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు సేత నద్దమున్‌
గలిగినఁ జక్కఁ జేసికొనుగాదె నరుండది చూచి భాస్కరా.


భావం - మొహం మీద బొట్టు పెట్టుకునేటప్పుడు అద్దము చూసుకుంటే వంకర లేకుండా సరిగ్గా బొట్టుపెట్టుకోవచ్చు. అలాగే తెలియని పనికి పూనుకున్నప్పుడు ఆ పని తెలిసిన వెరొకరి సహాయం తీసుకోవడం వలన, ఎంతటి పనినైనా చక్కగా పూర్తి చేయవచ్చు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy