నవీనము

15, జనవరి 2016, శుక్రవారం

వెంకటేష్ మూర్తి



వెంకటేష్ మూర్తి,హర్యానా రాస్ట్రంలోని ఐ.ఐ.టి కాలేజీలో ప్రొఫెసర్.ఒకరోజు సాయంత్రం తన సైకిల్ పై ఒక కాలనీకి వెల్లాడు,కొద్దిసేపు అక్కడున్న వారితో మాట్లాడి వెల్లిపోయాడు.మరుసటి రోజు ఉదయమే వచ్చి అక్కడున్న పిల్లలందరినీ పోగేసి చాక్లెట్స్ ఇచ్చి,ఒకే ప్రశ్న అడిగాడు "మీరెవ్వరూ బడికి వెల్లరా? అని" అందరి సమాధానం ఒక్కటే "ఊహూ" అని.పిల్లలని వెంటపెట్టుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాల్ల తల్లిదండ్రులతో మాట్లాడాడు.ఇక్కడా అందరి సమాధానం ఒక్కటే " రోజూ చెత్త ఏరుకొని సంపాదించే పైసలు మా తిండికి,జ్వరాలొస్తే మందులకే సరిపోతలేవు ఇంక బడికెలా పంపుతాము " అని. మళ్ళీ ఆరోజుకి వెళ్ళిపోయి ఉదయమే కాలనీకి వచ్చాడు.ఈసారి పిల్లలందరూ వారే దగ్గరికొచ్చారు. ఈసారి అందరికి చాక్లెట్స్ తో పాటూ నోట్ బుక్స్,పెన్నులు ఇచ్చాడు,పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు,ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది.చాలా మంది పిల్లలు బడిలో జాయిన్ అయ్యారు,వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది,వారి పరిశుబ్రతలో మార్పు వచ్చింది.అంతటికీ కారణం ఆ ఐ.ఐ.టి మాస్టారు పట్టుదల.రోజూ సాయంత్రం 5:45 నుండి 7:45 వరకు పిల్లలకు పాఠాలు చెప్పడం,ఉదయం 6:45 నుండి 8:15 వరకు బస్థి అంతా తిరిగి పిల్లలు బడికి వెల్లారా లేదా,పరిసరాలు శుబ్రంగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం ఇప్పుడు ఆయన దినచర్యలో భాగం అయ్యాయి.స్కూల్ అంటేనే బయపడే పిల్లలకి చాక్లెట్స్ తో దగ్గరై మంచిమంచి కథలతో చదువుపై ఆసక్తిని కలిగించాడు.అంతేకాదు వారికోసం బెంగాలి నేర్చుకొని వారికి మాతృభాషలో చెప్పాడు.ఇప్పటికీ ఆయన ఆద్వర్యంలో 60 మంది పిల్లలు చదువుతున్నారు.
హాట్సాఫ్ సర్.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy