నవీనము

16, జనవరి 2016, శనివారం

బుద్ధిమంతులు



  • ఉ. పూరితసద్గుణంబు గలపుణ్యున కించుక రూపసంపదల్‌
  • దూరము లైన వానియెడ దొడ్డగ జూతురు బుద్ధిమంతు లె
  • ట్లారయ గొగ్గులైన మఱి యందులమాధురిఁ జూచికాదె ఖ
  • ర్జూరఫలంబులం బ్రియముజొప్పడలోకులు గొంట భాస్కరా.

భావం - సద్గుణ సంపన్నుడు సంపదలు కోల్పోయినా, భుద్ధిమంతులు అతడిని ఎప్పటి వలే గౌరవిస్తారు. ఖర్జూరపు పండ్లు బుడుపులతో ఉన్నాయని వాటిని కొనడం మానేస్తారా? బుడిపలున్నా రుచిని బట్టే ఎవరైనా కొనేది. ఇది కూడా అంథే. బుద్ధిమంతులు అంతరంగికమైన గుణాలు చూస్తారే కాని బాహ్యమైన సంపదలను కాదు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy