నవీనము

3, జనవరి 2016, ఆదివారం

ధనము-దక్షత

దక్షుఁడు లేనియింటికిఁ బదార్థము వేఱొక చొటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ గల్ల కాదు ప్ర
త్యక్షము వాఁగులున్‌ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చు నే
యక్షము మైనగండి తెగినట్టి తటాకములోన భాస్కరా.
భావం - గండి పడిన చెరువులోకి వరద నీటిని మోసుకొచ్చే ఎన్ని వాగులు కలిసినా, అందులో చుక్క నీరు నిలవని విధంగానే మితంగా, జాగ్రత్తగా ఉపయోగించుకోవడం తెలియని వ్యక్తుల వద్దకు ఏ వస్తువులైనా వచ్చినా సరే, అవి ఎలా వచ్చాయో అలాగే పోతాయి కానీ ఏమీ మిగలవి, ఎవరికీ ఉపయోగపడవు. ఒకటి రెండు వస్తువులు కాదు, లక్షల్లో వచ్చినా, అదే పరిస్థితి ఉంటుంది. కనుక వస్తువులను మితంగా, అవసరమెరిగి వాడుకోవడం తెలియాలి. దానివలన డబ్బు ఆదా అవుతుంది, వనరులు సద్వినియోగమవుతాయి, కాలుష్యం తగ్గుతుంది.


   

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy