నవీనము

5, జనవరి 2016, మంగళవారం

వరాలప్పు



విక్కీరావు, అతని భార్య సరదాగా రెండు వారాల ఆస్ట్రేలియా ట్రిప్పు మీద బయలుదేరారు.
సముద్రం మీద విమాన ప్రయాణం హాయిగా సాగుతోంది.
ఒక్కసారిగా విమానం కుదుపుకొచ్చి కిందకి పడిపోవటం ప్రారంభించింది. అప్పుడే విమానం కాప్టెన్ అదేనండీ పైలట్ ఇలా చెప్పసాగాడు.
" ప్రయాణీకులకు ఒక దుర్వార్త. మన విమానం రెండు ఇంజన్లు పనిచేయటం ఆగిపోయాయి. మన విమానం కూలిపోతోంది. కానీ మీమిద్దరము కలిసి మాకున్న అనుభవముతో కింద ఉన్న ఒక నిర్జన ఐలెండ్ లో విమానాన్ని దింపటానికి ప్రయత్నిస్తున్నాము. అందుకని మీరంతా మా ప్రయత్నము విజయవంతం కావాలని భగవంతుని ప్రార్దించండి. " అన్నాడు. ప్రయాణీకులు అందరూ ప్రార్ధనలలో మునిగిపోయారు.
పదినిమిషాల తరువాత కాప్టన్ మళ్ళీ " ప్రయాణీకుల ప్రార్ధనలు ఫలించి మనం ఆ ఐలెండ్ లో దిగాము. కానీ మనము ఇఖ జీవితాంతము ఇక్కడే ఉండి పొవాల్సి వస్తుంది. మనకి సిస్టమ్స్ అన్నీ పాడయ్యాయి. "
అందరూ కిందకి దిగారు.
విక్కీరావు భార్యని " మనం ఐసీఐసీఐ బాంక్ వారికి ఇస్తామన్న ఐదు లక్షల డిపాజిట్ చెక్ పొస్టు చేశావా ?"
భార్య : " లేదు డియర్ !"
విక్కీరావు : " మరి వాళ్ళ మాస్టర్ కార్డ్ బాలన్స్ పే చేశావా?
భార్య : " లేదు. డియర్ !"
విక్కీరావు : " చివరగా చెప్పు. మనము వాళ్ళకి కట్టవలసిన కార్ లోన్ చివరిది కట్టావా ?"
భార్య : " అయ్యో! అది కూడా మరచి పొయా! "
విక్కీరావు భార్య అమాంతం కావలించుకుని ముద్దులు పెట్టాడు.
భార్య : " ఏమిటీ డియర్ ! ఇక్కడ ఇంత బాధగా ఉంటే నువ్వు ఇప్పుడు ?
విక్కీరావు : " ఆ బాంక్ వాళ్ళు మనల్ని కనుక్కుంటారు. "

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy