నవీనము

12, జనవరి 2016, మంగళవారం

2016 సంక్రాంతి శుభాకాంక్షలతో

సంక్రాంతి కానుకగా కేంద్రము తమిళు ల ఇష్టమైన మరియు వార సత్వ సంపద క్రీడ అయిన జల్లి కట్టు పై నిషేధం యెత్తివేశారు దీన్ని మంచి మిత్రుడు కూడా స్వాగతిస్తున్నాడు.

                                              జల్లి కట్టు ఆడటం వలన యెద్దులు ఏమంత హింసకు గురి అవ్వవు,అంతే కాక మన సంస్కృతి ఆచారాలు పండుగలు కేవలం వ్యవసాయం ఆధారంగా పుట్టినవి.ఈ ఆటలో ఆడే వారు యెవరు దాన్ని గాయపరచాలని ,చంపాలని ఆడరు కేవలం దాన్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తారు.యెంతైన అవి వారి నేస్తాలు మిత్రులు మరియు సంపదలు
          అసలు ఈ ఆట ఎలా మొదలైందంటే, ఇంతకు ముందు చెప్పినట్టు పూర్వం (ఇపుడు కూడా) మన దేశము వ్యవసాయ దేశము పండుగలు కూడా వీటినుంచే పుట్టాయి .ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి రైతుల పండుగ.
పూర్వం అంటే వర్షాన్ని ఆదారంగా పండించే రోజుల్లో, పంట చేతికి సంక్రాంతికి వచ్చేది(ఆ వచ్చే దినమే సంక్రాంతి(మంచి వెలుగు ) అయ్యిందో తెలీదు ).సంక్రాంతి అనగా మంచి వెలుగు ,నిజమే కదా ఆండీ ఎంతో కష్ట పడి చెమటోడ్చి ఆరు కాలం శ్రమిస్తే ఆ శ్రమ ఫలించే రోజు అంటే పంట సంపద గా చేతికి అందే రోజు నిజంగా సంక్రాంతి (మంచి వెలుగు )కదా వారి జీవితానికి.ఆ వచ్చే సంపదలో సగం హక్కు దారు ఈ యెద్దులే కదా మరి.ఇవి లేకుంటే సేద్యం అయ్యే పనేనా! వ్యవసాయం లో వీటి కష్టము ఎంతో కూడా చెప్పలేనిది ఇంకా గట్టిగా చెప్పాలంటే కష్టం లో 60 శాతo వీటిదే.
        అటువంటి నేస్తాలను మచ్చిక చేసుకోవడానికి ఉపయోగపడే ఆటే జల్లికట్టు,ఈ ఆట వలన  పూర్వం యెద్దుల సామర్థ్యం యువ రైతుల తెగువ తెలిసేది.అందుకే ఇతర ప్రాంతాలలో కూడా జల్లికట్టు కు దగ్గరగా ఉండే ఆటలు ఈ సంక్రాంతికి ఆడతారు అలాంటివే యెడ్ల బండి పరుగు పందాలు,బరువు లాగు పందాలు లాంటివి .

                                                            తెలుగు రాష్ట్రాలలో మాత్రం కోడి పందాలను ఆడటానికి ఉత్సాహం చూపిస్తారు .ఒక రకంగా చెప్పాలంటే మన జాతి కోళ్ళు ఇంకా మిగిలాయంటే ఈ కోడి పందెలే కారణం,హింస అంటే కత్తులు లేకుండా డబ్బు పందాలు లేకుండా ఆడటానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసుంటే ఈ సారి సంక్రాంతి ఇంకా అద్భుతంగా ఉండేది.అతి తొందరలో కోడి పందాలపై కూడా నిషేదం యెత్తివేస్తారని ఆశిస్తున్నా.
                                                 జంతుప్రేమికులు(అనే ముసుగు లో వచ్చే దొంగలు) , లౌకికవాదులు జల్లికట్టు పై ఈసారి పెద్ద డ్రామాలు చేయకపోవడం ముదావహం అయినా వాళ్ళు ఆ హక్కు యెపోడో కోల్పోయారు .వారు ఆవు యెద్దు మాంసము పై దేశం లో అంత రచ్చ జరుగుతున్నపుడు రాని వారు ఇపుడు ఎలా వస్తారు రారు .వారి ధృష్టి లో కేవలం కుక్కలు మాత్రమే జంతువులు వాటి పరిరక్షణ వారి ధేయం.
                                                            నా దృష్టిలో అంతే కాదు వైజ్ణానికంగా చూసా మనిషి కి మంచి మిత్రుడు కేవలం ఆవు యెద్దులు మాత్రమే ఎందుకంటార ?పూర్వం మనిషి వేటాడి మాంసాన్ని తినే వాడు .అలాంటి రాతి యుగపు మనిషి యేలా నాగరికుడు అయ్యాడు ?కేవలం పశుపోషణ వ్యవసాయం మాత్రమే వేటగాన్ని నాగరికున్ని చేసింది .ఎలా అంటారా ?జాగ్రతగా పరిశీలించండి అపుడు అడవులలో అత్యంత సులభంగా మచ్చిగా కాబడ్డ జంతువు కాబడే జంతువు కేవలం ఆవు మాత్రమే .ఆవు మాత్రమే అత్యంత సాధుజంతువు ప్రాణులలో.కొంతవరకు  ఆ ఆవులు పాలు ఇచ్చి వారి పోషక ఆహారం లో భాగమవ్వడం వలన మెల్లగా మనిషి వేట సంస్కృతికి దూరం అయ్యాడు.వాటి సంతతి యెద్దులు రవాణాకు వ్యవసాయము లో భాగస్వాములు అయ్యాయ్.దీని వల్ల పూర్తిగా వేటకు దూరం అయ్యి నాగరికుడిగా మారాడు.

                                             అలాంటి గొప్ప జంతువులు వ్యవసాయం లో వాటి బాగస్వామ్యం యంత్రాలతో పూరించబడుతున్నాయని ,వాటి ఎరువు స్థానం లో యూరియా దొర్కుతుందని మనం కృతఘ్నులు గా మారి వాటిని మాంసాహారంగా ,తోలు వస్తువులుగా మార్చడం మహా పాపము.ఆవులు ఆవుల సంతతి కోసం వాటి వృద్ధి కోసం వేదం, రాజులు ,మునులు ఎంత పరి తపిoచారు .ఏకంగా చక్రవర్తి అయ్యుండి ధీలుపుడు ఆవు కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్దపడ్డాడు,జగద్గురువు పరమాత్మ అయ్యుండి లోకాల పాలుడు గోపాలుడుగా మారాడు శ్రీకృష్ణ అవతారములో,దేవ దేవుడు శివుడు కూడా తన వాహనం నంది లేకుండా కదలడు.అలాంటి ఈ దేశం లో వాటిని చంపి తినడం ఘనకార్యంగా చూపించుకొని ప్రసారమాద్యమాలలో కెక్కి ఊక దంపుడు మాటలు చెప్పే మేధావుల నోర్లు ఈసారి ఎంతో అరిచాయి కానీ చట్టం అనే రూపం లో ఆవులూ ఎద్దులు ఈసారి రక్షింపబడి గత వైభావాన్ని పొందుతున్నాయి. 

                     ఈ సంవత్సరం గోవధ నిషేధ చట్టం  మరియు జల్లికట్టు లాంటి పూరతన ఆటలపై నిషేధం యెత్తివేయడం .అలాగే ఎంతో మంది రైతులు గో ఆదారిత ప్రకృతి వ్యవసాయం,పూర్వ పద్ధతులకు కి మారి లాభాలు గడిస్తూ ప్రకృతిని కాపాడుతున్నారు .వాటికి ప్రాచుర్యం పెరగడం కూడా 2016 వ సంక్రాంతి  కి కాస్త పండగ కళ ను   పెంచింది

                  రైతుల బల్వాన్మరణాలు పూర్తిగా ఆగిపోయి వారి అన్నీ కష్టాలు తీరి,రైతే రాజు అని గర్వం గా తిరిగే రోజు  రావాలని   అలాగే ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త వెలుగును ఆనందాన్నిఅందరి జీవితాలలో తేవాలని , మరింతగా దేశం సుభిక్షం అవ్వాలని ఆశిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ మంచి మిత్రుడు.జై హింద్
                                                

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy