నవీనము

12, జనవరి 2016, మంగళవారం

భాగవతము - రుక్మిణి కళ్యాణము



భాగవతము - రుక్మిణి కళ్యాణము

ఎ నీ గుణములు కర్ణేద్రియంబులు సోక దేహతాపంబులు దీరిపొవు.
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నులఖిలాద్రలాభంబు గలుగు చుండు
నే నీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్న తత్యంబు బొందగలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధు సంతతులు వాయు

నట్టి నీయందు నాచిత్త మనవతరము
నచ్చియున్నది ! నీ యాన !నాన లేదు
కరుణ జూడుము కంసారి !ఖలవిదారి !
శ్రీయుతాకార ! మాననీ చిత్తచోర దృఢ చిత్తం తో ఉన్న రుక్మిణి మొదటి ప్రేమలేఖ ఇది. ప్రణయ సందేశాన్ని సున్నితముగా కార్యసాధన దిశగా పంపడంలో ఉన్న మెళకువలు చూడండి . ఎన్ని విశేషణాలు వాడినదో చూడండి . ఖంసారి, ఖలవిదారి,శ్రియుతాకారుడు, మానినీ చిత్తచోరుడు. పని కావాలంటే ముందు ముఖస్తుతి చయ్యాలి పొగడాలి గదా తన ప్రఘాడ మయిన ప్రేమని " నీ యాన నాన లేదు " అంటే నీ తోడుసుమా! సిగ్గు విడచి చెపుతున్నాను . అంటున్నది. అంతటితో ఆగినదా, నాలుగు చరణాలలో అతిని గుణగణాలను కిర్తించినది .నాలుగు భక్తిమార్గాలు శ్రవణం దర్శనం,సేవ, భక్తీ అన్ని మేళవించి వ్రాసినది. బాలామణి కాదు మానినీ శిరోమణి. నీ గుణాలు అని నాలుగు చరణాలలో శ్రీకృష్ణుని కీర్తించిన విధం పోతన్నగారు బహు చక్కగా చప్పారు. అన్ని కాలాలలొనూ కార్యసాధకుడు గమనింప వలసిన విధానాన్నిమనముందు నిలిపాడు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy