నవీనము

26, జూన్ 2016, ఆదివారం

** భార్యలకు మాత్రమే **




** భార్యలకు మాత్రమే **
1) శ్రీవారికి తలనొప్పిగా వుంటే మీరు మౌనం వహిస్తే చాలు, ఆయనే కోలుకుంటాడు అమృతాంజనం అక్కర్లేదు
2) ఉదయం లేవగానే ఆయన కాళ్ళకు నమస్కరించకున్నా పర్లేదు, అతన్ని బెడ్ కాఫీ అడక్కుండా ఉంటే చాలు.
3) వారానికి కనీసం 4సార్లు ఆయనకు భోజనం స్వయంగా వడ్డించండి. ఆ అల్ప సంతోషి ఆనందిస్తాడు
4) మిగిలిన ఆహారం పనిమనిషికో, కుక్కకో వేసే ముందు, ఆయన తిన్నాడో లేదో చూడండి.అమాయకపు పక్షి మొహమాటం ఎక్కువ.
5) నలుగురిలో,ముఖ్యంగా ఆయనను మీ అత్త మామలను (మీ పుణ్యాన వాళ్ళు జీవించి వుంటే) చులకన చేయకండి.
6) మీ కన్నవారింటిలో పొరపాటున మీ అయన ఉండవలసి వచ్చినప్పుడు. అతనికి మీరు సేవ చేస్తున్నట్లు నటించండి. అలవాటుప్రకారం అదేశించవద్దు.
7) నెల మొదటి వారంలోనే కాక, అన్నిరోజులూ ఆయనను ప్రేమగా చూడండి, పిచ్చి మారాజు అన్ని ఆదాయాలు మీ చేతిలోనే పోస్తాడుగా.
8) అలిగి పుట్టింటికి వెళ్తానని ఉత్తుత్తినే ఆయన్ను బెదిరించకండి, కొన్నిసార్లైనా మాట నిలబెట్టుకోండి .
9) వరాలక్ష్మీవ్రతం, అక్షయ తృతీయ వంటి సందర్భాలలో మీ ఆయనకి కూడా ఒక గుడ్డముక్క తీయండి.సంబరపడిపోతాడు.
11) మీ బంగారు నగల్ని తరచూ మారుస్తూ మీ శ్రీవారిని ఏమార్చవద్దు.మీ అయన మనసే బంగారమని నమ్మండి .
12) మీవారు వేరే అమ్మాయిని చూస్తే, కుళ్ళు కోకుండా ఆమెలో మీ వారికి నచ్చిన అంశాలు మీరు అలవర్చుకోండి .
13) దిక్కుమాలిన టీవీ సీరియళ్ళు చూడడం మాని, సరదాగా మీ వారికొక ప్రేమలేఖ వ్రాయండి అందులో ఆయనలో మీకు నచ్చిన అంశాలు వ్రాయండి - కవితలు వద్దు అర్భకుడు తట్టుకోలేడు....
- ఇంకా వున్నాయి ప్రస్తుతానికివి పాటించి మీ శ్రీవారి మనసు దోచుకోండి.. పర్సును కాదు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy