నవీనము

19, జూన్ 2016, ఆదివారం

సుత్తి వీరభద్రరావు తన పనికిమాలిన కొడుకుని తిడుతూ బుద్ధి చెప్పే సీను. .



మొక్కుబడికి బుక్కలెన్ని చదివినా
బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా
చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా
కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా
బిక్కమొహం వేసుకొని
వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ
చుక్కలు లెక్క బెడుతూ
ఇక్కడే ఈ ఉక్కలో
గుక్కపెట్టి ఏడుస్తూ
ఈ చుక్కల చొక్కా వేసుకొని
డొక్కు వెధవలా ..
గోళ్ళు చెక్కుకుంటూ
నక్క పీనుగులా చెక్కిలాలు తింటూ
అరటి తొక్కలా ముంగిట్లో తుక్కులా
చిక్కుజుట్టు వేసుకొని
ముక్కుపొడి పీలుస్తూ
కోపం కక్కుతూ పెళ్లాన్ని రక్కుతూ.
పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ
రెక్కలు తొడిగిన అక్కుపక్షిలా నక్కీ నక్కీ
ఈ చెక్కబల్ల మీద బక్కచిక్కి
ఇలా పడుకోకపోతే
ఏ పక్కకో ఓ పక్కకి వెళ్లి
పిక్క బలం కొద్దీ తిరిగి
నీ డొక్క శుద్ధి తో
వాళ్లని ఢక్కామొక్కీలు తినిపించి
నీ లక్కు పరీక్షించుకొని
ఒక చక్కటి ఉద్యోగం చిక్కించుకొని
ఒక చిక్కటి అడ్వాన్సు చెక్కు .....
చెక్కు చెదరకుండా పుచ్చుకొని
తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ.....

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy