నవీనము

29, మార్చి 2016, మంగళవారం

"మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా?



"మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా? అలాగే స్వార్ధ పరిత్యాగంచేతనే ఘనకార్యములు సాధించబడతాయి." --- Swami Raama Teertha

అది లాహోర్ విశ్వవిద్యాలయం, 1892 సంవత్సరంలో బి.ఏ. గణితశాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రంలో 13 ప్రశ్నలిచ్చి ఏ తొమ్మిదింటికైనా జవాబులు వ్రాయమని అడిగారు. ఒక విద్యార్థి 13 ప్రశ్నలకూ జవాబువ్రాసి పై వాటిలో ఏ తొమ్మిదింటినైనా పరీక్షించుకోవచ్చునని అడుగున వ్రాశాడు. ఆ విద్యార్థికి విశ్వవిద్యాలయంలో ప్రధమస్థానం లభించింది!

అతడే స్వామి రామతీర్థయని పేరుగాంచిన తీర్థా రామగోస్వామి, అతడు 1873 అక్టోబర్ 23న పంజాబులో గుజరన్ వాలజిల్లా మురళీ వాలా గ్రామంలో జన్మించాడు. తండ్రి హీరా నందుడు పురోహితుడుగా జీవించేవాడు. పదవ యేటనే రామతీర్థకు వివాహమైనది. బిడ్డగూడ కలిగాడు. ఎం.ఏ చదివిన పిదప కొంతకాలం లాహోర్ క్రిష్టియన్ కాలేజిలో లెక్చరర్ గా పనిచేశాడు. పిదప సన్యాసం స్వీకరించి హిమాలయాలలో చాలాకాలం గడిపాడు.


ఒకనాడు ఆయనభార్య "నన్ను మీరు గుర్తుంచుకుంటారా !" అని అడిగింది.
అందుకు రాముడు, "ఉంచుకోను. ఎందుకు గుర్తుంచుకోవాలి? నాకు ముక్కున్నదని, చెవివుందని, కళ్ళువున్నవని గుర్తుంచుకుంటానా? అవినాలోని భాగాలే.. నీవు నేనే, మరెందుకు జ్య్నాపకముంచుకోవడం" అని నవ్వుతూ అన్నాడు. ఆదర్శదాంపత్యం ఎలాంటిదో ఈ మాటలలో ధ్వనిస్తున్నది. తానే భార్య: భార్యయే తానూ ఈ విధమగు భావన దంపతులలో వుండడం మన సంస్కృతియొక్క లక్షణం!

ఆయన హ్రుషికేశంలో వుండగా ఒకనాడు దగ్గర బంధువొకడు రొమ్ములు బాదుకుంటూ, శోకిస్తూ అక్కడికి వచ్చాడు. "ఏమిటి సంగతి! అని రాముడడిగాడు. ఇంటివద్ద రామతీర్థుని కుమారుడు మరణించాడని అతడు చెప్పాడు.
రాముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. :ఇదేమిటి ? గాలివీస్తున్నదనీ, చెట్లు పేరుగుతున్నవన్నీ, నీరు ప్రవిహిస్తున్నదనీ ఎడవడంలో ఎంత అర్డంలేదో, నీవా బాలుని మృతికి శోకించడంలోగూడా అంత అర్దంలేదు. మరణమనేది ప్రకృతిలో సహజమైనది. ఇందులో శోకింపతగిన దేమీ లేదు". ఎంతచక్కనిఉపమాన మిచ్చాడు!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy