నవీనము

30, మార్చి 2016, బుధవారం

ఒకరోజు శ్రీ కృష్ణదేవరాయలు కొలువుకు ఒక నర్తకి వచ్చి



ఒకరోజు శ్రీ కృష్ణదేవరాయలు కొలువుకు ఒక నర్తకి వచ్చి,
"మహారాజా! నేను 9 భాషలలో పాడుతూ, లయబద్ధంగా
అడగలను...
మీ అష్టదిగ్గజాలలో
ఎవరైనా సరే నా మాతృభాష ఏదో
చెప్పగలరా?" అని సవాల్ విసిరింది..
సరే అని రాజుగారు నృత్య ప్రదర్శనకి ఏర్పాటు చేయించారు...
కాసేపటికి నృత్య ప్రదర్శన పూర్తి అయింది...
"మీలో ఎవరైనా నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని
ఆ నర్తకి ప్రశ్నించగా.. అందరూ తెల్ల మొహం వేసారు...
రాజు గారు మన తెనాలి రామకృష్ణుడి వైపు చూసారు...
రామకృష్ణుడు " నాకు ఒక పది నిమిషాల సమయం కావాలి, అలా
తోటలోకి వెళ్లి వచ్చి సమాధానం చెపుతాను ప్రభూ!." అని
చెప్పి...బయటకు వెళ్తూ నర్తకి కాలు తొక్కాడు...
వెంటనే నర్తకి "idiot,are you blind? manner less
fellow " అని తిట్టింది ...
వెంటనే రామకృష్ణుడు "ప్రభూ! ఈమె మాతృభాష తెలుగు"
అని చెప్పాడు..
"అయ్యబాబోయ్, ఎలా కనిపెట్టారండి" అని విస్మయానికి
గురైంది ఆ నర్తకి...


ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడితే,తన మాతృభాష తెలుగు అని ఎలా
కనిపెట్టావ్ అని రాజు గారు కూడా అడిగితే,

"సహజంగా అందరు బాధలో,కోపంలో తమ మాతృభాషలో
మాట్లాడుతారు,

కానీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు మన తెలుగు వాడు మాత్రమే
అయి ఉంటాడు మహా ప్రభూ" అని తెనాలి
రామకృష్ణు డు చెప్పారు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy