నవీనము

17, జనవరి 2016, ఆదివారం

"భక్తి" సమపర్పణను కోరుతుంది..



పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చ్హతి
తదహం భక్త్యుప హృత మశ్నామిప్రయ తాత్మనః ( భ . 9-26)

అంటే భగవంతునికి నువ్వేది సమర్పించినా, భక్తితో, హృదయశక్తితో సమర్పించు.
అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, జలమైనా సరే....
అందుకే " భక్తి రేవ గరీయశీ" అన్నారు.
భక్తి, హృదయశుద్ధి, మోక్ష మార్గానికి టికెట్టు వంటిది. కాబట్టి మోక్ష ప్రయాణనికి, భగవత్కృప, మోక్షప్రాప్తికి భక్తి, చిత్త నైర్మల్యం ముఖ్యం.
భగవంతునకు విదురుడు, ద్రౌపది పత్రమును, గజేంద్రుడు పుష్పమును, శబరి ఫలమును...ఇలాగ ఎందరో భక్తితో కృతార్ధులయ్యారు.
"భక్తి" సమపర్పణను కోరుతుంది....అది హృదయం నుండి, మానసికంగ వచ్చేది.....భక్తుడు ఉన్మత్తుడుగా ఉంటాడు. తన దైవానికి తప్ప, అతనికి ఇంకేది ఉండదు.
ఆకలిదప్పిక ఉండదు. అహాన్ని వదిలి పరిపూర్ణ శరణాగతి పొందడమే భక్తికి మొదటిమెట్టు. అంత్యం ముక్తి. రధానికి రెండు చక్రాలవలే, పక్షికి ఉన్న రెండు రెక్కల వలే భక్తి, విశ్వాసం రెండూ కలసి ఉంటాయి......!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy