ఉ.భూనుతు లైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్
మాని చరింపరో యనుచు మానవు లట్ల చరింపఁబోల దం
భోనిధులన్నియుం దనదుపుక్కిటఁ బట్టె నగస్త్యుఁ డంచు నా
పూనిక కెవ్వఁ డోపునదిపూర్వమహత్త్వముసుమ్ము భాస్కరా.
మాని చరింపరో యనుచు మానవు లట్ల చరింపఁబోల దం
భోనిధులన్నియుం దనదుపుక్కిటఁ బట్టె నగస్త్యుఁ డంచు నా
పూనిక కెవ్వఁ డోపునదిపూర్వమహత్త్వముసుమ్ము భాస్కరా.
భావం - పూర్వం దేవతలు కొన్ని వారివరసలు మాని, శాస్త్రవ్యతిరేకమైన పద్ధతులనుసరిచి చరించారని వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పటి జనం అలా చేయరాదు. అలా చేద్దామనుకునేవాడు, పూర్వం అగస్త్యుడు తన పుక్కిట సముద్రాలను ఇముడ్చుకున్నడాని వీళ్ళు అట్లా చేయగలరా? లేదు. అది పూర్వులు సామర్ధ్యమని తెలుసుకోవాలి.
నిజానికి ఒక విషయం గుర్తించాలి. ఎట్లాగైతే యుగధర్మాలు వేరుగా ఉంటాయో, అట్లాగే లోకాలకు కూడా ధర్మాలు వేరుగా ఉంటాయి. దేవలోక ధర్మాలు మానవులకు వర్తించవు. మానవలోక ధర్మాలను మానవులు పాటించాలే కానీ ఈ ధర్మాలను ఆధారంగా చేసుకుని దేవలోక ధర్మాలను నిందించకూడదు. వేదం, భగవంతుడు ఒకరే అయినా, ఆయా లోకాలు, వాటి ఉద్దేశాలు, శక్తులను అనుసరించి అక్కడి ధర్మాలుంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి