నవీనము

4, జనవరి 2016, సోమవారం

హారికి నందగోకుల విహారికి



హారికి నందగోకుల విహారికి జక్ర సమీరదైత్యసం
హారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబినీమానో
హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటి పయోఘ్రుతా
హారికి బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన
 పోతన తన భాగవత గ్రంధాన్ని శ్రిరామునికు అంకిత మివ్వాలని నిర్ణయించుకొని కృతి సమర్పణలో భాగంగా వ్రాసిన పద్యమిది. చూడండి . ప్రతి చరణ ప్రధమంలో" హారికి " అన్నపదాన్ని ప్రాసలో ప్రయోగించి శబ్ద చమత్కారంతో ఆకట్టుకున్నాడు . మొదటి చరణంలో సుందరమయిన హారములు ధరించు వాడని , గోకులంలో విహరించు వాడని, రెండవ చరణంలో భక్తుల దుఃఖములు హరించువాడని, ముడవ చరణంలో గోపకాంతల వృదాయాలను అపహరించు వాడని, నాలుగవ చరణంలో పాలుపెరుగు హరించు వాడు,పూతన వంటి రక్కసిని అంతమొందించిన వాడు అని చెప్పుచున్నాడు ఒకేపదాన్ని వివిధ అర్ధాలలో వాడి పద్యానికి కొత్త అందం తెచ్చాడు. చదవడానికి సొంపుగా , వినడానికి ఇంపుగా ఈ ఉత్పలమాలని భగవానునికి సమర్పించాడు. ఇదీ పోతన రచనా రీతి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy