నవీనము

10, జనవరి 2016, ఆదివారం

జపాన్ రైల్వే పెద్ద మనసు

జపాన్ రైల్వే పెద్ద మనసు కు ఎంతో చక్కటి ఉదాహరణ చూడండి...ఒక అమ్మాయి చదువు కోసం ఏకంగా ట్రైన్ నడుపుతున్నారు ఒకే ఒక అమ్మాయి చదువు కోసం...ఎంతటి గొప్ప విషయమో కదా ..అవును నిజంగానే గొప్ప విషయం ..ఎపోడో పండగలకు పబ్బాలకు .అదనపు బోగీలు వేసి రద్దీ అని చెప్పి డబ్బులు బాదే మన రైల్వే వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి...

               అసలు ఎందుకు జపాన్ వారు ఆ అమ్మాయీకోసం ఏకంగా ట్రైన్  నడుపుతున్నారో  చెప్తా వినండి
జపాన్ లో ఉత్తర ప్రాంతం లో అదొక చిన్న దీవి ఆ దీవి పేరు  హొక్కడో అందులో కైమి - శిరటకి అనే స్టేషన్ .ఈ దీవి మారు మూల ప్రాంతం  అవ్వడం ,అంతే కాక అక్కడనుంచి యెటువంటి రాకపోకలు రైల్ ద్వారా ప్రజలు సాగించక పోవడం ద్వారా సర్వీసులను ఆపాలని రైల్వే బోర్డు నిర్ణయెంచింది.

                                            కానీ ఒక పాప మాత్రం తన బడికి వెళ్లడానికి ఈ రైల్  సెర్వీసు  ని ఉపయోగిస్తుందని తెలిసి వారి నిర్ణయాన్ని మార్చుకొని ,అంతేనా తమ రైల్ సెర్వీసులను కూడా ఆ పాప బడికి వెళ్లడానికి రావడానికి వీలుగా మార్చుకుంది.తను కాలేజీ వెళ్లే వరకు అలాగే తమ సర్విసు ను కొనసాగించాలని నిర్ణయించారు.

                                                                   వారి భావీ దేశ పౌరురాలు కోసం వారి చూపించే చొరవను ప్రశంసిస్తు,అలాగే మన రైల్వే బోర్డు వారు కూడా దేశ పౌరులు కోసం చక్కగా శ్రమిస్తారని ఆశిస్తూ.
                                                                           మీ మంచి మిత్రుడు

Share this:

2 కామెంట్‌లు :

  1. వావ్!! ఇది ఎంతో స్పూర్థిదాయకం మిత్రమా! ఇలాంటివి మరిన్ని విశేషాలు మకు అప్‌డేట్ చెయ్యండి!!!

    రిప్లయితొలగించండి
  2. తప్పకుండా మిత్రమా మీ అభిప్రాయానికి దన్యవాదములు

    రిప్లయితొలగించండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy