నవీనము

10, జనవరి 2016, ఆదివారం

ముద్దులు


విదేశం లో పని చేస్తున్న ఒక భర్త తన భార్యకు వ్రాసిన లేఖ

" డియర్ రాధ డార్లింగ్!

గ్లోబల్ మార్కెట్ క్రైసెస్ వల్ల, మా కంపెనీ చాలా నష్టాల్లో కూరుకుపోయి, మాకు సాలరీస్ ఇవ్వలేదు. కాబట్టి నేను ఈ నెల డబ్బులు పంపలేకపోతున్నాను. ఈనెల ఎలాగోలా అడ్జస్ట్ చేసుకో. వందముద్దులతో


ప్రేమతో
నీ భర్త

దానికి భార్య రిప్లై

"ప్రియమైన శ్రీవారికి,

మీరు పంపిన ముద్దులు అందాయి. థాంక్యూ.
క్రిందటి నెల మీరు పంపిన ముద్దులు ఎలా ఖర్చు చేసానో క్రింది లిస్ట్ చదవండి..

1. ఒక నెల పాలకోసం, పాలవాడు రెండు ముద్దులకి ఒప్పుకున్నాడు.

2. ఈనెల, కరెంట్ కట్ చెయ్యకుండా వుండటానికి, లైన్ మెన్ ఏడు ముద్దులకి సరేనన్నాడు.

3. రెంట్ కి బదులుగా, ఇంటి ఓనర్ రోజుకొక ముద్దు తీసుకుంటున్నాడు.

4. కిరాణాషాపువాడు పది ముద్దులకు ఒప్పుకోలేదు. సో, ఇంకో ఐదు ఎక్ష్ట్రా ఇవ్వాల్సొచ్చింది.

5. చిల్లరమల్లర ఖర్చులకి ఇంకో పది ఖర్చైపోయాయి.

ఇంకా నలబై నాల్గు బ్యాలెన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ ముద్దులతో, ఇంకొక నెల కూడా గడిపగలననే అనుకుంటున్నాను. సో, ఈనెల కూడా, క్రిందటి నెలలానే ప్లాన్ చేసుకోమంటారా?

యువర్ స్వీట్ హార్ట్

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy