నవీనము

17, జనవరి 2016, ఆదివారం

మంచిచెడ్డలెరుగక నోరుందికదా అని ఎక్కడ పడితే అక్కడ



ఉ. ప్రల్లఁదనంబుచే నెఱుకపా టొకయింతయు లేక యెచ్చటన్‌
బల్లిదుఁ డైనసత్ప్రభు నబద్ధము లాడినఁ ద్రుంగిపోదు రె
ట్లల్ల సభాస్థలిం గుమతులై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం
గల్లలు గృష్ణునిం బలకికాదె హతం బగుటెల్ల భాస్కరా.


భావం - మంచిచెడ్డలెరుగక నోరుందికదా అని ఎక్కడ పడితే అక్కడ, గొప్పవారిని దూషించేవారు తప్పకుండా నశిస్తారు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సమయంలో జనులందరూ ఉన్న చోట శ్రీ కృష్ణుని నిందించిన శిసుపాలుడు, దంతవక్ర్తుడు అనే ఇద్దరు అన్నదములు మరణించలేదా?

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy