నవీనము

22, జూన్ 2016, బుధవారం

దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి



దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! పళ్ళు ఊడక ముందే, శరీరంలో బలమున్నప్పుడే, పటుత్వం పోయిందని స్త్రీలు ఏవగించుకోకముందే, ముసలితనంతో శరీరం శిధిలం కాక మునుపే, తల వెంట్రుకలు నెరసి తెల్లగా కాకముందే, శరీర అందం తగ్గకముందే నీ పాదాలను స్మరించి, సేవించాలి స్వామి.

వ్యాఖ్య: శ్రీ రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు. వాడిన పువ్వులు దైవపూజకు పనికిరాని విధంగానే మనసు కల్మషం కాకముందే ఈశ్వర భక్తి కలగాలి. అందుకే పిల్లలు 6 ఏళ్ళు ఉండగానే వాళ్ళకి భక్తి అలవాటు చేయాలి.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy