నవీనము

4, జనవరి 2016, సోమవారం

హరికి జన్మ




జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.


భావము:


“ చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మములు ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తు ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మములు కల్పించి. ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మాలు లేనేలేవు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy