నవీనము

14, జనవరి 2016, గురువారం

మన దేశానికి చెందిన ఒక ధనికుడు జపానుకు వెళ్ళాడు



ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవలసిన మంచి విషయం ఈ చిన్న సంఘటనలో ఉంది. దయచేసి తప్పక చదివి షేర్ చేయగలరు.........
మన దేశానికి చెందిన ఒక ధనికుడు జపానుకు వెళ్ళాడు. మన అలవాట్ల ప్రభావం అతనిలో అలాగే ఉన్నాయి. అలవాటుగా ఒకరోజు రైలులో ప్రయాణిస్తూ....... ఎదుటి సీటుపై కాళ్ళను విలాసంగా ఉంచి ఆనందంగా ఓ పాటను పాడుకుంటూ రైలులో ప్రయాణిస్తున్నాడు....... అప్పుడు ఒక పెద్ద మనిషి అతని దగ్గరికి వచ్చి అతని కాళ్ళని తన ఒడిలోకి తీసుకుని ఆ సీటులో కూర్చున్నాడు. అతని చర్యకు మనవాడు ఉలిక్కి పడి అతన్ని ఇలా అడిగాడు..
" సార్! మీరు ఎందుకు నా కాళ్ళను తీసి మీ ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు? మీ సీటును ఎందుకు వదిలి వచ్చి నేను కాళ్ళు పెట్టుకున్న సీటులోకి ఎందుకు మారారు?" అని. దానికి ఆ జపాను దేశస్థుడు ఇలా అన్నాడు : "సార్! మీరు మా దేశ ఆస్తిని అవమానిస్తున్నారని నాకు చాలా కోపం వచ్చింది, కానీ మీరు మా దేశానికి అతిధులు. మిమ్మల్ని నేను ప్రశ్నించకూడదు. మీరు చిన్నబుచ్చుకోవడం, బాధపడటం నాకు ఇష్టం లేక మీ కాళ్ళను నా ఒడిలో పెట్టుకుని మీకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఇలా చేశాను" అని అన్నాడు. మనవాడు షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడి తన తప్పును తెలుసుకుని అతన్ని క్షమించమని అడిగాడు.
దానికి అతను నవ్వుతూ.. "ఈ దేశంలో ప్రజల ధనంతో కల్పించే వసతులపై గౌరవంతో పాటు అది మా సొంత ఆస్తిగానే భావిస్తాము. మీరుకూడా మీ దేశంలోని ప్రజలధనంతో నడిపే రైళ్ళు కానీ, బస్సులు కానీ మీ సొత్తుగా భావించండి, ఇలా కాళ్ళు పెట్టి అవమానించకండి. అలాంటి భావనమీలో కలిగినప్పుడు ఖచ్చితంగా ఇతరదేశాలకు మీరు వచ్చినప్పుడు మీరు ఇలా ప్రవర్తించరు. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు కదా! " అని అన్నాడు. ఆ జపాను దేశస్థుడు మెత్తగా చెప్పినా, బుద్ధివచ్చేలా చెప్పిన అతని మాటలకు మనవాడు తలదించుకోక తప్పలేదు.
ఇప్పుడు అర్థం అయిందా ఇండియా ఎందుకు అభివృద్ధి చెందలేదో! ఎన్నో కారణాలు.. అందులో ఇదికూడా ఒకటి. ఏ గొడవలు జరిగినా ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతున్న మనం ఖచ్చితంగా మనం తగలబెట్టేది మన ఆస్తి అని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా!..

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy