నవీనము

18, జనవరి 2016, సోమవారం

ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం




శీను పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .
ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
.
దానిని ఒక ప్రదర్శనలో ఉంచాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు.
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " గుర్తు పెట్టండి అని అందులో రాశాడు .
.
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . దాని నిండా" ఇంటూ " గుర్తులే, ఏమాత్రం ఖాళీ లేదు . చాలా బాధపడ్డాడు.
.
ఏడుస్తూ తనకు పెయింటింగ్ నేర్పిన మాస్టారు దగ్గరకి దానిని తీసుకు వెళ్ళాడు శీను  . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు మాస్టారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో రాశాడు .
.
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
.
.
.
.
..
.
.
ఎందుకలా జరిగింది ?
.
.
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy