నవీనము

2, జనవరి 2016, శనివారం

ఒక గొప్ప ప్రేమికుడు









పేదవాడైన అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించాడు. ఒకరోజు తన ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పాడు.
అప్పుడు ఆ అమ్మాయి - " చూడు, నీ నెల జీతం నా ఒక్క రోజు పాకెట్ మనీ అంత ఉండదు. ఎలా అనుకున్నావ్ - నేను నిన్ను ప్రేమిస్తానని. నీ రేంజ్ ఏంటి? నా రేంజ్ ఏంటి..? నన్ను చేసుకోవాలని అనుకొనే అతనికో స్టాటస్ ఉండాలి. అందుకే నన్ను మర్చిపోయి, నీ లెవల్ కి తగ్గ వాళ్ళని చూస్కో..." అని చెప్పింది.
కానీ అతను ఆ అమ్మాయిని అంత తొందరగాగా మర్చిపోలేకపోయాడు...


పది సంవత్సరాల తరవాత..



 


ఒక షాపింగ్ మాల్ లో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు.

అమ్మాయి, " హాయ్.. బాగున్నావా? నాకు పెళ్లయింది ఒక అబ్బాయి కూడా., నీకు తెలుసా? మావారి సాలరీ ఎంతో.. నెలకి 2 లక్షలు. అదీ ప్రపంచ ప్రఖ్యాతి ఫలానా సంస్థలో. నిన్ను చేసుకునుంటే నాకు ఇంత స్టాటస్ వచ్చేదా....?!"
ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఏమీ చెప్పలేక మౌనముగా ఉండిపోయాడు.
ఇంతలో ఆమె భర్త అక్కడికి వచ్చాడు. ఆ అబ్బాయిని చూసి -
"సర్, మీరు ఇక్కడ....? ఈమె నా భార్య ప్రియ. ప్రియా...! ఈయన మా బాస్. నేను పనిచేస్తున్న మల్టీ నేషనల్ కంపనీకి అధిపతి. ప్రపంచ కోటీశ్వరుల్లో ఈయనా ఒకరు. ప్రియా, నీకు తెలుసా...?సర్ కి ఇంత స్టాటస్ ఉండి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం : సర్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారంట. కానీ అప్పుడు సర్ కి ఆస్థి ఏమీ లేదని అమ్మాయి కాదంది. తను ఎంత దురదృష్టవంతురాలో కదా... సర్ ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు.. ఈ రోజుల్లో సర్ లాంటి గొప్ప ప్రేమికులు ఎంతమంది ఉంటారు... " అని తన భార్యకు చెప్పాడు.

ఆమె తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది..
నీతి :
జీవితం చాలా చిన్నది. అందులో ఎప్పుడు ఓడలు బళ్ళు అవుతాయో, బళ్ళు ఓడలు అవుతాయో ఎవరూ చెప్పలేరు. ఈరోజు నిరుపేద ధనికుడు కావొచ్చు. ధనికుడు నిరుపేద అవొచ్చును. ఎవరినైనా మనం అపహాస్యం చేసి, అవమానిస్తే - పరిస్థితులు తారుమారు అయినప్పుడు భరించలేని పరిస్థితి ఎదురవుతుంది. దయచేసి, ఎవరినీ చులకనగా చూడకండి. ఎలాంటి స్థితిలో అయినా ఎవరినీ తక్కువగా, చులకనగా చూసి, గర్వముగా మాట్లాడకూడదు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy