నవీనము
మిత్రుడి అంతరంగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మిత్రుడి అంతరంగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2016, గురువారం

పళ్ళ రసాలను మాత్రo తీసుకోండి



మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లనైతే అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేక పోయిందో, అవే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్లు రంగుమారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌డ్రింకులో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్‌డ్రింక్‌ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి.
అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి?

పళ్ళ రసాలను మాత్రo తీసుకోండి

22, ఫిబ్రవరి 2016, సోమవారం

స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త



స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను చులకన చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవారు స్వామి. అలాంటి సంఘటనలు కొన్ని… ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశంలాగ కాకుండా, ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న "ఇంగర్ సోల్ " అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నారు. మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి "చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నారు. ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నారు.

18, ఫిబ్రవరి 2016, గురువారం

శరీరం రెండు ముక్కలైంది… కొన్ని క్షణాల్లో ప్రాణాలు పోతాయి ఆ క్షణం లో ఎవరికైనా ఏం గుర్తొస్తుంది…!?




శరీరం రెండు ముక్కలైంది… కొన్ని క్షణాల్లో ప్రాణాలు పోతాయి ఆ క్షణం లో ఎవరికైనా ఏం గుర్తొస్తుంది…!? ఆమ్మా…!? నాన్న..!? స్నేహితులు, ప్రేమించిన అమ్మాయి..? ఇంకేదైనా గుర్తొస్తుందేమో…. కానీ అతనికి మాత్రం తన శరీరంలోని అవయవాలతో మరొకరిని బతికించాలనిపించింది. తన ప్రాణాలు పోవటానికి కొన్ని క్షణాల ముందు. తన చుట్టూ చేరిన జనాలని చూస్తూ అతను చెప్పిన మాటేమిటో తెలుసా… ” నా శరీరంలో పనికొచ్చే ఏ భాగాన్నైనా మరొకరికి అమర్చేందుకు ఇవ్వండీ” అని… లారీ కింద పడ్డ తన దేహం రెండు ముక్కలు గా మారినా… ఆ సమయం లోనూ అతను తన శరీర భాగాలను మరొకరికి ఇవ్వండి అని చెప్పి మరణించాడు… వివరాల్లోకి వెళితే…
కర్నాటక కు చెందిన హరీశ్ నంజప్ప అనే 23 ఏళ్ళ యువకుడు బెంగుళూరులో ఉంటున్నాడు. తన స్వగ్రామం “గొబ్బి”కి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లాడు. తన ఓటుహక్కును వినియోగించుకొని బెంగళూరుకు తిరిగొస్తుండగా.. జాతీయ రహదారి4 పై ఉన్న తిప్పగొండనహళ్లి అనే గ్రామం వద్ద పంచాదార బస్తాలతో వస్తున్న ఓ లారీ.. పల్సర్ పై వెళుతున్న హరీశ్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. దీంతో అతడు లారీ టైర్ల కింద పడిపోయాడు. అలా పడిపోగానే అతడి దేహం రెండు ముక్కలుగా విడిపోవడంతోపాటు నడుము నుంచి కాళ్ల వరకు ఉన్న భాగాన్ని లారీ కొన్ని అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. తలతో ఉన్న మొండెం భాగం మరోచోట పడిపోయింది. అతడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణం పోతున్న ఆ కొద్ది ఘడియల్లోనే రోడ్డుపై వెళ్లేవారిని దగ్గరకు పిలిచి తన అవయవాల్లో ఏది పనికొస్తే అది దానం చేయాల్సిందిగా కోరాడు. ఈలోగా స్థానికులు రెండుగా విడిపోయిన అతడి శరీర భాగాలను ఓచోట చేర్చి ఆస్పత్రికి తరలించారు. కానీ కాసేపట్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర బాధాకరమైన పరిస్థితుల మధ్య కూడా హరీష్ క్షణాల్లో తన అవయవాలు దానం చేయాలన్న ఆలోచన రావడం మామూలు విషయం కాదనీ, అతన్ని చూసిన ఆసుపత్రి వైద్యులు సైతం కంటతడి పెట్టుకున్నారట… మరణం అంచులోనూ మరొకరి ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతోనే ఉన్న హరీష్ కు నివాళులతో నమస్కరిద్దాం……

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

వీర జవానుకు జోహార్లు

కర్ణాటక లొని హుబ్లీలొని వైద్య శాల  నుండి అంతిమ యాత్రకు లక్షల సంఖ్యలొ ప్రజలు తరలివచ్చారు. దాదాపు 7 కిలొమీటర్ల మేర రొడ్లు ప్రజలతొ నిండిపొయాయి. లాన్స్ నాయక్ అమర్ రహే అన్న నినాదంతో తొ హుబ్లీ మార్మొగిపొయింది.






5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం



ప్రదీప్ ఎప్పుడూ ఒక ముసలామె దగ్గర కమలాలు కొంటాడు .
.
ఆ రోజు కూడా కొన్నాడు . ఆమెకు డబ్బులు ఇచ్చేశాడు . సంచీలోనుండి ఒక కమలా తీసి వలిచి ఒక తొన తిన్నాడు .
.
" అబ్బా ! ఎంత పుల్లగా ఉందొ ! ఈ పండు వద్దు . నువ్వే తిను " అంటూ వలిచిన పండును ఆ ముసలామెకు ఇచ్చేశాడు .
.
.
ఆమె మిగిలిన తోనలలోనుండి ఇంకో తోన తీసి తింది .
.
" అదేమిటి బాబూ ! ఇంత తియ్యగానే ఉంటేనూ ! " అంటూ ఉంటె
," నాకు ఒద్దు నువ్వే తిను " అంటూ వచ్చేశాడు .
.
.
కూడా వస్తున్న రాధిక అడిగింది
.
" అదేమిటండీ ! రోజూ ఆమె దగ్గరే కొంటారు . ఆమె తియ్యటివే ఇస్తోంది . అయినా రోజూ పుల్లగా ఉంది అని ఒక పండు వెనక్కి ఇచ్చేస్తారు . అదేమీ తెగులూ ? "
.
" ఆమె అన్ని పళ్ళను అమ్ముతుంది . కానీ ఒక్కపండు ఎప్పుడూ తినదు . అందుకే మా అమ్మకే పెడుతున్నా అనుకుంటూ రోజూ ఎదో ఒక వంక పెట్టి ఒక పండు ఆమె తినేలా చేస్తున్నా " కళ్ళల్లో కదులుతున్న కన్నీరు రాధికకు కనబడకుండా దాచుకుంటూ అన్నాడు ప్రదీప్ .
.
..
.
ఇక్కడ పక్కనే పళ్ళు అమ్ముతున్న అతడు అడుగుతున్నాడు .
.
ఏమిటక్కా ! రోజూ ఆయనకు ఎక్కువ పళ్ళు తూస్తావూ ? ఆయనేమో నీకు అందులోంచి ఒకటి తీసి వలిచి ఇస్తాడూ ! ఎందుకు అలా ఎక్కువ తూస్తావూ ?
.
.
" అతను నా మీద ప్రేమతో నేను పళ్ళు తినాలి అని అలా చేస్తున్నాడు . నాకు తెలియదు అనుకుంటున్నాడు . అతడికి నా మీద ఉన్న ప్రేమ వలన ఆ తక్కెడ అలా ఎక్కువ తూగుతుంది అంతే కానీ నేను తూచడం లేదు " అంది ఆ ముసలామె
.
జీవితం లో ఇటువంటి ఆనందాలు కొద్ది మందికే సాధ్యపడతాయి .
.
డబ్బుతోనూ , అధికారం తోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం

3, ఫిబ్రవరి 2016, బుధవారం

64 విద్యలు(కళలు)అంటే ఏవి?



64 విద్యలు(కళలు)అంటే ఏవి?

మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

అర్థము:

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)

2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు
(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)

3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు

4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.

5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు

6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము

7. నాటకములు

8. గానము (సంగీతం)

9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము

10. కామశాస్త్రము

11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,

12. దేశభాషాజ్ఞానం

13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.

14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము

16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,

17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము

18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము

19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం

20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము

21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము

22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము

24. పాకకర్మ= వంటలు

25. దోహళము=వృక్షశాస్త్రము

26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు

27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.

31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య

33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.

41. వాణిజ్యము - వ్యాపారాదులు.

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.

43. కృషి - వ్యవసాయ నేర్పు.

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి

45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.

47. మృగయా - వేటాడు నేర్పు

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.

49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.

51. చిత్ర - చిత్రకళ

52. లోహా - పాత్రలు చేయి నేర్పు

53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.

54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు

55. దారు - చెక్కపని

56. వేళు - వెదరుతో చేయు పనులు

57. చర్మ - తోళ్ళపరిశ్రమ.

58. అంబర - వస్త్ర పరిశ్రమ

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య

31, జనవరి 2016, ఆదివారం

మోడుల్లా, మొండిగోడల్లా ఎన్నాళ్ళని బ్రతుకుతాం


 

స్వామీ వివేకానంద జయంతి -
మోడుల్లా, మొండిగోడల్లా ఎన్నాళ్ళని బ్రతుకుతాం; లంగరు లేని నావల్లా ఎక్కడికని సాగిపోతాం. ఇకనైనా మేలుకొందాం...వజ్రకఠోరమైన సంకల్పం కోసం, ఉక్కు నరాలను, ఇనుప కండరాలను బలిపెడదాం. జింకల్లా కల్లోలపడుతూ...నక్కల్లా కుతంత్రాలు పన్నుతూ కాదు మనం జీవించాల్సింది. మృగరాజులా మహా గంభీరంగా మసలుకుందాం. విశ్వాంతరాళాన్నే మధించగలిగే మేధస్సు నిండిన అమృత పుత్రులం మనం. మణుల వేటకై వెళుతూ మిణుగురుల వెలుగుకు ఆకర్షితులం కావడం అవమానకరం. పరమోన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుందాం.
మనకోసం నిరీక్షిస్తున్న ఆర్తులు, అనాథలు, అభాగ్యులు ఎందఱో ఉన్నారు. స్వామీజీ నినదించినట్లు వారందరిలో ఆ సర్వేశ్వరుడిని దర్శించుకుందాం. నా దేశంలో కుక్క కూడా ఆకలితో చావడాన్ని నేను భరించలేననే వారు స్వామి వివేకానంద. మరి నేడు మన కళ్ళముందే తోటి మానవులు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఏ ఒక్కరి క్షుద్బాధను తీర్చినా మన జీవితం ధన్యమైనట్లే. మనలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. అంతమాత్రాన బాధపడాల్సిన పనిలేదు. వాటిని అధిగమించే బలం కూడా మనలోనే ఉంది. వేయిసార్లు విఫలమైనా ఏదో ఒకరోజు మనం వాటి నుంచి బయటపడగలం. ఈ ప్రపంచమనే కర్మాగారంలో వినియోగించక తుప్పుపట్టే యంత్రంలా కాకుండా, శ్రమకు సమర్పణమై సార్థకతను సాధించుకుందాం. కండరాలతో కూడిన మన శరీరాలు అంత్యదశలో ఎముకల గూడును మోసుకుపోవడం వల్ల ప్రయోజనం ఏముంది? స్వామీజీ అంటారు ‘రోగం చేతనో, ఆకలి చేతనో చనిపోవడం కాదు, పరుల కోసం పోరాడి కన్నుమూయండి’ అని. ఆ మహనీయుని అడుగుజాడల్లో పయనిద్దాం, పునీతులమవుదాం.

30, జనవరి 2016, శనివారం

పొగడ్తను మించిన మత్తు పదార్థం లేదు! విద్య - విలువలు - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు




విద్య - విలువలు
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

పొగడ్తను మించిన మత్తు పదార్థం లేదు!
ఆవు ఎక్కడెక్కడో పచ్చిగడ్డి మేస్తుంది. ఎవరూ తాగడానికి పనికిరాని నీళ్లను తాగి అందరికీ పనికివచ్చే పాలను ఇస్తుంది. ఆ పాలను విడిచి పెట్టడానికి దానికి ఒక లక్షణం ఉంటుంది. పొదుగు దగ్గరకు దూడ వెళ్లి, దాని సిరములు నోటితో పట్టుకుని ముట్టెతో నాలుగు గుద్దులు గుద్దితే చాలు ఆవు పాలు విడిచిపెట్టేస్తుంది. ఒకసారి విడిచిపెట్టిన పాలను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. అదే ఆవు అది త్వరత్వరగా తిన్న ఆహారాన్ని కడుపులోకి పంపి, తర్వాత తీరిగ్గా దానిని మళ్లీ ఉండలుండలుగా నోట్లోకి తెచ్చుకుని నెమరు వేసుకుని తిరిగి కడుపులోకి పంపగలదు.
కానీ అలా పాలధారలను వెనక్కి తీసుకోలేదు. అలా వదిలి పెట్టినప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి. దూడైనా, పాలు పితికే పశుపోషకుడైనా కచ్చితంగా పాలధారని అలా ఒడిసి పట్టుకోవాల్సిందే. ఏ మాత్రం స్థాన చలనమైనా పాలు నేలపాలైపోతాయి. గురువు కూడా ఇలాగే ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జిస్తాడు. ఏ విధమైన స్వార్థమూ లేకుండా గురువు జ్ఞానధారను వదలడం మొదలుపెడితే శిష్యుడు అంతే జాగ్రత్తగా చెవులను దొప్పలుగా చేసుకుని ఆ ధారలను ఒడిసి పట్టుకోవాలి.

మీరందరూ విద్యార్థులు. మీకు సరస్వతీ కటాక్షం ఉండాలనీ, వాగ్దేవి కటాక్షం ఉండాలని మీ పెద్దలు, మీ గురువులు నిత్యం ప్రార్థిస్తుంటారు. వాగ్దేవి సరస్వతి స్వరూపమే. కానీ వాగ్దేవిలో ఉండే లక్షణం వేరు. వాగ్దేవి అంటే వాక్కుకు అధిష్ఠానమైన దేవి అని. దివ్ అనే ధాతువులోంచి వచ్చిన పదం దేవి. దివ్ అంటే కాంతి. కాంతి ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు. తెలుసుకోవడం అనేది ఒక విశేషం. గతంలో ఎన్నో మంచి విశేషాలుంటాయి. వాటిని తెలుసుకోవడం ఎలా సాధ్యమౌతుందంటే - ప్రవాహం వలన సాధ్యమౌతుందని వేదం చెబుతున్నది. సరస్వతీ సూక్తం ప్రకారం సరస్వతి అంటే ప్రవహించునది. సరస్వతి అలా ప్రవహించకపోతే ఏమవుతుంది! అలా ప్రవహించకుండా ఎవరిలోనైనా ఉండిపోతే వాడు దుర్మార్గుడైపోతాడని శాస్త్ర వాక్కు.

ఎవరికైనా ఒక విషయం తెలుసనుకోండి. దానిని ఇతరులకు చెప్పి తీరాలి. అది ప్రవాహం చేతనే సాధ్యమౌతుంది. కానీ అలా అతను చెప్పలేదనుకోండి. ఆయన మూగవాడా ? కాదే ! కానీ చెప్పడు. ఎందుకలా అంటే అది లోభకారకం కావాలి. అంటే ఆయన సంతోషించడానికి ఏదో ఉండాలక్కడ. ’’ఇది నేను ఇతరులకు చెప్తే నాకేం వస్తుంది?’’ అన్న ఆలోచన ఉంటుంది. అలా పుచ్చుకున్న దానిని బట్టి చెప్పడం ఉంటుంది తప్ప, నేను చెప్పడమే ప్రయోజనం అన్నట్లుండదు. అటువంటి వారిలో సరస్వతి-వాగ్దేవిగా మారిందని చెప్పడం సాధ్యం కాదు.

అందుకే సరస్వతీ కటాక్షం గొప్పదా? వాగ్దేవి కటాక్షం గొప్పదా? అంటే శాస్త్రం వాగ్దేవి కటాక్షమే గొప్పదని చెప్పింది. వాక్ అన్నదానిని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని ఏ వస్తువునైనా కాల్చివేస్తుంది. వాక్కు అజ్ఞాన దాహంతో ఉంటుంది. ఎదుటివాడిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చగలిగినదేదో దానికే వాక్కు అని పేరు. ఏదో నోరుంది గదా అని చెప్పి అక్కరలేని మాటలను మాట్లాడేవాటిని వాక్కులని పిలవరు. భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి అంతకంటే మరో ప్రయోజనం ఉంటుందని తెలియనివాడు అలా ప్రవర్తిస్తాడు. అవి అవతలివాడిని పాడు చేస్తాయంతే.

అందుకే వాక్కులో ఎప్పుడూ రెండు లక్షణాలుంటాయి. వాక్కుని సక్రమంగా వినియోగించకపోతే ఆ వాక్కు మత్తు కల్పిస్తుంది. నేను నిష్కారణంగా మిమ్మల్ని పొగిడాననుకోండి. పొగడ్తను మించిన మత్తు లోకంలో మరొకటి లేదు. ఏదైనా ఒక మత్తు పానీయాన్ని ఎవరైనా స్వీకరిస్తే దాని తాలూకు ప్రభావం వారి శరీరంలో కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ విశేషమైన పొగడ్త జీవితాంతం జ్ఞాపకం ఉండి పాడుచేయడానికి పనికొస్తుంది. అంటే వాక్కులు హితకరం కావాలి. అవతలివాడి అభ్యున్నతికి పనికి వచ్చేవై ఉండాలి తప్ప కేవలం అవతలివాడిని పొగడడానికి మాత్రమే పనికివచ్చేటట్లుగా వాక్కు ఎప్పుడూ ఉండకూడదు.

వాక్కులు హితకరం కావాలంటే... సంస్కారముండాలి. మనమిలా మాట్లాడితే అవతలివాడికి హితం కలుగుతుందా లేదా అని ఆలోచించి ఎప్పుడు ఎక్కడ అవతలివాడికి హితం కల్పించాలో అటువంటి మాట మాట్లాడాలంటే వారిలో సంస్కార బలం ఉండాలి. సంస్కార బలమంటే కేవలం చదువుకుని ఉండడం కాదు. అవతలివాడి అభ్యున్నతిని ఆపేక్షించగలిగినవాడై ఉండాలి. ‘‘నా వాక్కుతో అవతలివాడికి ఉపయోగం కలగాలి. వాడికి మంచి జరగాలి’’ అని లోపల ఎవరిలో త్యాగబుద్ధి ఉంటుందో అటువంటివారు మాత్రమే హితకరమైన వాక్కు పలకగలరు. అవతలివాడు హితకరమైన వాక్కు పలికినా ఇవతలివాడికి అది ఎప్పుడు హితమౌతుంది... అంటే వినయం కలిగినవాడైతేనే అది సాధ్యపడుతుంది.

ఈరోజుల్లో మనం గురువు, శిష్యుడు, అధ్యాపకుడు, విద్యార్థి, ఉపాధ్యాయుడు... ఇటువంటి మాట వాడుతున్నాం గానీ, ఒకానొకప్పుడు ఈ దేశంలో కులవిద్య ఉన్న రోజుల్లో గురువు-శిష్యుడు అన్న పదబంధం కన్నా ముందు వాడబడిన పదాలు వినీతుడు, వినీయుడు. గురువు చెప్పిన మాటలను సరిగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే విద్యార్థి కాగలిగిన అర్హత ఉన్నవాడు. గురువు అంటే బరువు అని అర్థం. దానికి వ్యతిరేక పదం- లఘువు. అంటే చిన్నది అని. అంటే గురువు స్పర్శ, గురువు స్మరణంతో పాటూ ‘‘ఆయన నాకు హితకరుడు, ఆయన మాట నాలోని అజ్ఞానాన్ని దహింప చేస్తుంది. ఆయన మాటలను నేను ఒడిసి పట్టుకోవాలి’’ అన్న పద్ధతిలో శిష్యుడి ఆలోచన సాగాలి. గురువు మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత చెవులను దొప్పలుగా చేసుకుని జ్ఞానధారలను లోనికి పుచ్చేసుకోగలగాలి
 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy