నవీనము

1, మార్చి 2016, మంగళవారం

ఓ శివా! ఈ రాజులు ఐశ్వర్యం అనే మదంతో గుడ్డి వాళ్ళయ్యారు



శా. రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలుఁ, బరి తృప్తిం బొందితిన్‌, జ్ఞానల 
క్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - ఓ శివా! ఈ రాజులు ఐశ్వర్యం అనే మదంతో గుడ్డి వాళ్ళయ్యారు. అదే శాశ్వతం అనుకుంటున్నారు. వారిని సేవించటం నరకం వంటిది. వారిచ్చే పరిచారికలు, గుర్రాలు, పల్లకీలు, ఆభరణాలు మొదలైనవి అన్నీ ఆత్మను తెలుపలేవు సరికదా ఇంకా భౌతికతను పెంచే సంసార దుఃఖానికి బీజాలు. వాటిని అనుభవించి సంతృప్తి చెందాను. ఇక చాలు ఈశ్వర! నాకు జ్ఞాన సంపదనిచ్చి మేల్కొలుపు తండ్రీ

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy