నవీనము

29, ఫిబ్రవరి 2016, సోమవారం

చక్కటి చతురులు



  " మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".


"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక"

కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.

"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."

"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".

"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."

"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.

"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"

  ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?"
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy