నవీనము

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

శ్రీ కాళహస్తీశ్వరా! ఐశ్వర్యములనే మెరుపులతో కూడిన సంసారమనెడి గొప్ప మేఘములు



శా. శ్రీ విద్యుత్కలి తాజవంజన మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతే చాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళ హస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! ఐశ్వర్యములనే మెరుపులతో కూడిన సంసారమనెడి గొప్ప మేఘములు నుంచి వర్షించిన పాపములనే నీటిధారల వలన నా మనస్సనే పద్మము యొక్క ప్రకాశాన్ని కోల్పోయాను. ఈశ్వరా! ఇప్పుడు నీ కరుణ అనే శరత్ కాలం వచ్చింది. ఇది చాలా, నా మనో పద్మము వికసించింది. ఇక నుంచి సర్వశక్తిమంతుడవైన నీ చిన్మూర్తిని కొలుస్తూ జీవిస్తాను.

ఐశ్వర్యము వచ్చి పోతుంది కనుక దాన్ని మెర్పులతో పోల్చారు. సంసారం అనేది మాఘాల వంటిది, మేఘాలు దట్టంగా కమ్ముకుంటే ఆకాశం కనిపించనట్టే సంసారంలో దిగబడిపోతే ఆత్మ గోచరించదు. సంసారం అనగా ప్రపంచం అని అర్దం.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy