శా. అంతా మిథ్య తలంచి చూసిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్ధంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!
కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్ధంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!
భావం - ఈశ్వరా! ఆలోచించి చూస్తే, ఈ జగత్తంతా మిధ్యగా తెలుసుకున్న ఈ మానవులు ఇంకా భార్య, పిల్లలు, ఐశ్వర్యము, శరీరం అంటూ ఇవన్నీ శాశ్వతాలని తలుచుకుంటూ మోహభ్రాంతిలో పడి జీవిస్తున్నారే కానీ జీవత పరమార్ధమైన నీ యందు కొంచమైనా భక్తి నిలిపి కొలవడం లేదు కదా! ఆహా~ ఈ మానవులెంత అజ్ఞానులు ఈశ్వరా! మిధ్య అంటే ఉండి లేనీది, లేక ఉండినది అని అర్దం. ఈ జగత్తు ఉంది, కానీ ఎంత వరకంటే మనసు ఆత్మ నుంచి వేరుగా ఉన్నంతవరకే. ఆత్మలో మనసు లయమైతే జగత్తు ఉండదు. కనుక మనసు ఆత్మ నుంచి వేరుగా ఉన్నంతవరకు జగత్తు కనిపిస్తూనే ఉంటాయి. మిధ్య అన్నారని జగత్తుకు చెందిన సమస్యలను పట్టించుకోకుండా ఉండడం అధర్మం అవుతుంది. భౌతిక జగత్తులో ఉన్నంతవరకు ఇక్కడి ధర్మాలని పటించవలసిందే. కానీ నిరంతరం నేనీ దేహం కాదు, ఆత్మ అన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి