నవీనము

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

చెడ్డపనులు చేసిన వంశములయందు జన్మించినవారికి ఎంత మంచి గుణాలున్నా



ఉ. హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె
న్నేనియుఁగల్గియున్న నొకనేరము చెందకపోదు పద్మముల్‌
భూనుతిఁ గాంచియుం బురదఁ బుట్టుటవల్ల సుధాకరోదయం
బైననసహ్య మొందవె ప్రియంబునఁ జూడఁగలేక భాస్కరా.


భావం - చెడ్డపనులు చేసిన వంశములయందు జన్మించినవారికి ఎంత మంచి గుణాలున్నా, ఏదో ఒక దుర్గుణము ఉండకపోదు. బురద యందు పుట్టిన కమలములు అందరికి ఆనందం కలిగించినా, చంద్రోదయం చూడలేక అసహ్యంతో ముడుచుకుపోతాయి.

*పద్యంలో వాడిన కులం అనేమాటకు అర్దం వంశం అనే కానీ ఇప్పుడు చెప్పబడుతున్న కులాలు కాదు. సాహిత్యంలో ఎక్కడ కులం కనిపించినా, అది వంశంగానే అర్దం చేసుకోవాలి. రఘుకుల తిలకుడు అని శ్రీ రాముడిని అంటారు. అనగా రఘువంశంలో జన్మించినవాడని అర్దం.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy