చ. స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్కము
ష్కరుఁ డతి నీచవాక్యములఁ గాదనిపల్కిననమ్మహాత్ముఁడుం
గొఱఁత వహింపఁడయ్యెడనకుంఠితపూర్ణ సుధాపయోధిలో
నరుగుచుఁగాకి రెట్ట యిడినందున నేమికొఱంత భాస్కరా.
ష్కరుఁ డతి నీచవాక్యములఁ గాదనిపల్కిననమ్మహాత్ముఁడుం
గొఱఁత వహింపఁడయ్యెడనకుంఠితపూర్ణ సుధాపయోధిలో
నరుగుచుఁగాకి రెట్ట యిడినందున నేమికొఱంత భాస్కరా.
భావం - శాశ్వతమైన ఎన్నో సద్గుణములు కలిగి కీర్తి గడించిన సజ్జనుని తక్కువ చేయటానికి కుటిలుడు ఎన్ని మాటాలు అన్నా, సజ్జనుడు కోల్పేదేమీ ఉండదు. సముద్రంలో కాకిరెట్ట వేసినంత మాత్రాన సముద్రానికి ఏ లోపం రాదు కదా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి