నవీనము

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

బాగా చదువుకుని డబ్బు సపాదించినవానిని చూసి వాడిలా



ఉ. వానికి విద్యచేత సిరి వచ్చె నటంచును విద్య నేరఁగాఁ
బూనినఁబూనుఁగాక తనపుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనఁగ నెవ్వఁ డోపు సరిపో చెవిపెంచునుగా కదృష్టతా
హీనుఁడు కర్ణభూషణము లెట్లు గణింపఁగనోపు భాస్కరా.


భావం - బాగా చదువుకుని డబ్బు సపాదించినవానిని చూసి వాడిలా తాను గుడా విద్య నేర్చుకోవాలని ప్రయత్నం చేయవచ్చు కానీ, తనకు పూర్వపుణ్యం లేకపోతే సంపదలు ఎలా ఆనుభవిచగలడు? దానికేమి ప్రయత్నం చేయగలడు? చేవులకు పెద్దపెద్ద పోగులు పెట్టుకున్నవారిని చూసి తాను గూడా అట్లా ధరించాలని ఆశపడి, చెవులు కుట్టించుకున్నా, ఆ ఆభరణములు ఎక్కడి నుంచి తీసుకురాగలడు?

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy