ఉ. సంతతపుణ్యశాలి నొకజాడను సంపద వాసిపోయి తా
నంతటఁ బోక నెట్టుకొని యెప్పటియట్ల వసించియుండు మా
సొంతమునందుఁ జందురుని నన్నికళల్ పెడఁబాసి పోయినం
గాంతివహింపఁడోటు తిరుగంబడి దేహమునిండ భాస్కరా.
నంతటఁ బోక నెట్టుకొని యెప్పటియట్ల వసించియుండు మా
సొంతమునందుఁ జందురుని నన్నికళల్ పెడఁబాసి పోయినం
గాంతివహింపఁడోటు తిరుగంబడి దేహమునిండ భాస్కరా.
భావం - పుణ్యాత్ముడికి ఒకానొక వేళ సంపద మొత్తం నశించినా అతడు పూర్వం వలే సాధారణంగానే ఉంటాడు. దానికి కృంగిపోడు. సంపదలు వచ్చి పోవడం సహజమని అతనికి తెలుసు. చంద్రుడు అమావాస్య నాడు ఒక్క కళ కూడా లేక బింబమంతా క్షయించినా, మళ్ళీ ఒక్కో కళ పెరిగి ఎప్పటి వలే వెలుగుతున్నాడు కదా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి