నవీనము

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా -రాగం: పున్నాగవరాళి తాళం: ఆది -రచన: త్యాగరాజ







రచన: త్యాగరాజ

రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:
గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి:
అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము||

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము||

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ||గంధము||

హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము||

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ||గంధము||

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy