1. ప్రభుత్వ ఆఫీస్ లలోనే కాదు ప్రైవేటు ఆఫీస్ లలో కూడా ఉద్యోగస్తుడు ప్రశాంతం గా నిద్ర పోయిన రోజే మనకు నిజమయిన స్వాతంత్ర్యం వచ్చినట్టు
...
2. వర్షాకాలం వర్షాలని .. ఎండాకాలం ఎండలని .. చలి కాలం లో చలి ని ఎలా ఆప లేమో ..... పోయే కాలం వచ్చినా అలానే ఆపలేము ....
...
3. ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో .... పక్కన ఆడి పెళ్ళాం లేదని అర్ధం ....
...
4. అడిగిన వెంటనే అప్పుదొరికిన రోజు ఇచ్చిన అప్పు తిరిగి అడగని వారు పెరిగిన రోజే దేశం అభివృద్ధి పథం లొ నడుస్తుంది
...
5. వ్యక్త పరచని ప్రేమ అనేది పేకాట లాంటిది లైఫ్ జోకరు పడింది అని సంతోషించేలోపె పక్కొడికి డీల్ షో పడిపొతుంది
....
6. మనిషి ఆశ అనే పెనం మీద దోసలేస్తూ ఉంటాడు ఒక్క దోస మాడిందని ...పిండి పాడేసు కుంటాడ లేక పెనం పగల గోడతాడ ? రెండు చెయ్యడు పెనం బాగా తుడిచి మళ్ళివేస్తాడు ....... అపజయాలు మాడిన దోస లాంటివి
....
7. అతిగా ఆవేశ పడిన అమ్మాయి ... అల్లుళ్ళని ఆడి పోసుకున్న మామ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు
....
8. ప్రియురాలు పువ్వులాంటిది కొట్టినా పెద్ద దెబ్బ తగలదు ....... పెళ్ళాం పెంకు లాంటిది కొడితె బొక్కడిపోద్ది
....
9. ప్రేమ అనేది బీరకాయ తొక్కలాంటిది ... తెలిసిన వాడు దానితో పచ్చడి చేసుకుంటాడు తెలియని వాడు బయట పడేస్తాడు ... టోటల్ గా చెప్పొచ్చేది ఏందయ్యా అంటే ప్రేమలో పడితే పచ్చడి అయిపోతారు
.....
10. పరుల సొమ్ము ఫినాయిల్ లాంటిది సూడటానికి తెల్లగా ఉన్నా తాగితే పోతాం ......
....
11. బుర్ర లేనొడితో వాదించటం అంటే....ప్రెష్ గా తడిసి వచ్చిన బురద పంది తొ బాక్సింగ్ లాంటిది తెగించి దిగితే గెలుస్తావ్ మనకెందుకొచ్చిన బురదలే అనుకుంటె ఓడిపొతావ్
.....
12. అబద్దానికి అయుష్షు తక్కువ ... బట్టలు తక్కువేెసె హీరొయిన్ మీద పుకారులెక్కువ 13. పాలల్లొ నీళ్ళు కలపక పొతె పాల వాడికి ఎంత నష్టమొ ... దేశం లొ వెదవలు లేక పొతె దేశానికి అంతే నష్టం
....
14. ఒక సిగరెట్ మరో రెండు సిగరెట్ లని వెలిగించక పోతే అది ఎంత కాస్ట్లీ సిగరెట్టూ అయిన గొప్ప సిగరెట్ అవ్వలేదు .... ఒక ఎధవ మరో ఇద్దరు ఎధవలని తయారు చెయ్యక పొతే వాడు ఎంత పెద్ద ఎధవ అయినా .. గొప్ప ఎధవ కాలేడు ...
.....
15. కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ కూడా స్టార్ హోటల్ లో డిష్ అవుతుంది
.....
16. ఏడుపులు పలు రకాలు ....
మనం బాగు పడటం లేదు అని ఎడ్చేవాళ్ళు
ఎప్పుడు బాగుపడతాం అని ఎడ్చేవాళ్ళు
పక్కనొడు బాగు పడితే ఏడ్చే వాళ్ళు
పక్కనొడు ఎక్కడ బాగుపడతాడో అని ఎడ్చేవాళ్ళు
మొదటి ఇద్దరిది ఆశ మిగతా ఇద్దరిది అత్యాశ ... మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు ....
......
17. భరించేవాడిని భర్త మరియు పీడించే దాన్ని పెళ్ళాం అంటారు ....

కామెంట్‌ను పోస్ట్ చేయండి