నవీనము
కీర్తనావైభవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కీర్తనావైభవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2016, ఆదివారం

తెలవారదేమో స్వామీ





తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ


చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు

కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ..

తెలవారదేమో స్వామీ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ

ఆ మత్తు నే మది మరి మరి తలచగా..
మరి మరి తలచిగ..
అలసిన దేవేరి .. అలమేలు మంగకూ..

తెలవారదేమో స్వామీ..
చిత్రం : శృతిలయలు
గానం : యేసుదాస్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహాదేవన్


2, మార్చి 2016, బుధవారం

జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా || రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ||

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ||

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ||

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ||

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ||

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ||

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ||

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ||

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||

గానము

 

                                    

జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర-రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ||

మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||

గానము-



ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు-రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ||

వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె |
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||

పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె |
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ||

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె |
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||

     గానము

29, ఫిబ్రవరి 2016, సోమవారం

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా-రచన: అన్నమాచార్య







రచన: అన్నమాచార్య

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ||

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ||

అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై |
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ||

గానము


తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన ||రచన: అన్నమాచార్య





రచనఅన్నమాచార్య
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ||
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే ||
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ||
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ||
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ||
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ||
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ||


 

గానము





                                  కేవలము వాద్య సంగీతము

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఏమి సేతురా లింగా, ఏమీ సేతురా




ఏమి సేతురా లింగా, ఏమీ సేతురా

గంగ ఉదకము తెచ్చి నీకు
లింగ పూజలు సేదమంటె...
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా
మహానుభావ మా()దేవశంభో మాలింగమూర్తి

అక్షయావుల పాడి తెచ్చి
అరిపితము చేదమంటె...ఒహో
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
మహానుభావ మా()దేవశంభో మాలింగమూర్తి

తుమ్మిపూవులు తెచ్చి నీకు
తుష్టుగా పూచ్చేదమంటె...ఓహో
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావ మా()దేవశంభో మాలింగమూర్తి


గానము-

 


 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy