నవీనము

2, మార్చి 2016, బుధవారం

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు-రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ||

వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె |
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||

పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె |
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ||

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె |
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||

     గానము

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy