నవీనము

2, మార్చి 2016, బుధవారం

శివా! నిన్ను నమ్మినట్లు నేను ఇతరులను నమ్మను. నీవు తప్ప



శా. నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్‌ నీకన్న నా కెన్న లే
రన్నల్‌ దమ్ములు తల్లి దండ్రులు గురుండాపత్సహాయుండు, నా
యన్నా! యెన్నడు నన్ను సంసృతి విషాదాంభోధి దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁదేల్చెదొ కదే ! శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శివా! నిన్ను నమ్మినట్లు నేను ఇతరులను నమ్మను. నీవు తప్ప నాకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, గురువులు, ఆపదలో ఆదుకునేవారెవరూ లేరు. ఓ శ్రీ కాళహస్తీశ్వరా! సంసారమనే విష సముద్రమును దాటించి నీ చిదానంద స్వరూపమైన శాశ్వతమైన ఆనదంలో నన్ను ఎప్పుడు ఓలలాడిస్తావో కదా!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy