నవీనము

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

తిరువీథుల మెఱసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను-రచన: అన్నమాచార్య



రచన: అన్నమాచార్య

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ||

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద |
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ||

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ||
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు ||

కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ||
                                    

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy